ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం “పుష్ప : ది రైజ్” భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన బృందానికి అభిమానులు, తోటి పరిశ్రమ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కానీ అల్లు అర్జున్ కోసం ఆయన తనయుడు అల్లు అయాన్ చేసిన స్పెషల్ ట్వీట్ ఈ రోజును మరింత స్పెషల్ గా చేసింది. అయాన్ ఒక చిన్న పెన్సిల్ స్కెచ్ తయారు చేసి ‘పుష్ప విడుదల (17-12-2021)… ఆల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్’ అంటూ ‘పుష్ప’రాజ్ ను విష్ చేయడం విశేషం.
Read Also : ‘పుష్ప’ పబ్లిక్ టాక్… ఎలా ఉందంటే ?
ఈ స్కెచ్‌ని బన్నీ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “నా చిన్ని బాబూ థాంక్యూ… నా అయాన్ ఐ లవ్ యూ… నువ్వు ఈ కార్డ్‌తో నా ఉదయాన్ని మరింత ప్రత్యేకం చేశావు” అంటూ కొడుకుపై ప్రేమను కురిపిస్తూ పొంగిపోయాడు అల్లు అర్జున్. ఈ అందమైన చిన్న డ్రాయింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకుంటున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు మలయాళ భాషల్లో పుష్ప పాన్-ఇండియా విడుదలైంది.