Allu Arjun: ఇద్దరు పోరంబోకులకు నేషనల్ అవార్డు వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గా మారిపోయాడు. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది జాతీయ అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లుగా ఈ అవార్డును అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం. దీంతో బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది. ఇక జాతీయ అవార్డు అందుకున్న విన్నర్స్ అందరికి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గండిపేట లో గ్రాండ్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు మొత్తం హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో బన్నీ ఎమోషనల్ అయ్యాడు. తన 20 ఏళ్ల కల నిజమైందని, తన మిత్రుడు దేవి శ్రీప్రసాద్ తో కలిసి ఈ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.
“బాలీవుడ్‌కు వెళ్లమని దేవిశ్రీ ప్రసాద్‌కి ఎన్నోసార్లు చెప్పా. దాదాపు 20 ఏళ్లలో ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు. నేను ఆ మాట చెప్పిన ప్రతిసారీ.. ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు నేనూ వచ్చేస్తా అనేవాడు. అతడి మాటలు విని.. మనకెక్కడ సాధ్యమవుతుందిలే అనుకునేవాడిని. అలాంటిది మేమిద్దరం ఒకేసారి పుష్పతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. అక్కడా మంచి విజయాన్ని అందుకున్నాం. 20 ఏళ్ల నుంచి దేవితో అంటున్న మాట ఇలా నిజమైనందుకు నాకు సంతోషంగా అనిపించింది. జాతీయ అవార్డులకు మా ఇద్దరి పేర్లు ప్రకటించిన నాడు మా నాన్న ఎంతో ఆనందించారు. నేను కూడా ఢిల్లీ వస్తా.. దేవికి వాళ్ళ నాన్న సత్యమూర్తి లేకపోతే .. నేను ఉన్నానుగా.. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డులు వచ్చినట్టు ఉందన్నారు. నాన్న మేము సాధించాం. మీ భాషలో చెప్పాలంటే.. చెన్నైలో తిరిగే ఇద్దరు పోరంబోకులు.. ప్రిన్సిపల్ దగ్గర టీసీలు తీసుకునే మేం.. ప్రెసిడెంట్ దగ్గర మెడల్స్ తీసుకుంటామని అనుకున్నావా? అని అడిగాను.
Also Read
జీవితంలోని ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని సాధారణంగా మనం అనుకుంటాం. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటేనే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ, నాకు అవార్డు రావాలని సుకుమార్ మరెంతగానో కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. దీని ఎఛీవర్ ఆయనే.. నేను కేవలం అఛీవ్‌మెంట్ మాత్రమే..” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!