ప్రస్తుతం బన్నీ క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్.. తన మాసివ్ పర్ఫార్మెన్స్‌తో నేషనల్ అవార్డ్ అందుకొని 68 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు. నెక్స్ట్ పుష్ప పార్ట్ 2తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రీజనల్ లెవల్లో తీసిన పుష్ప ఫస్ట్ పార్ట్ 1తో పాన్ ఇండియా హిట్ కొట్టిన సుకుమార్… ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్‌గా సెకండ్ పార్ట్ చేస్తున్నాడు. ఈ లెక్కన పుష్ప2 ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే మూడు నిమిషాల వీడియోని శాంపిల్‌గా చూపించేశాడు. ఈ సినిమా తర్వాత బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం గ్యారెంటీ. ఖచ్చితంగా పుష్ప2 వెయ్యి కోట్ల బొమ్మ అవుతుంది. దీంతో బన్నీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగతో భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు కానీ ఈ మధ్యలో మరో డైరెక్టర్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. తేరీ, బిగిల్ వంటి మాస్ సినిమాలు తీసి కమర్షియల్ హిట్ కొట్టిన అట్లీతో… బన్నీ ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది.
ఇక షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమా హిట్ అవడంతో… బన్నీ, అట్లీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఓకే అయిందనేది లేటెస్ట్ న్యూస్. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని.. వచ్చే ఏడాదిలో షూటింగ్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. అయితే ప్రజెంట్ బన్నీకి ఉన్న క్రేజ్‌కు అట్లీ లాంటి డైరెక్టర్… జస్ట్ కమర్షియల్ సినిమా మాత్రమే ఇవ్వగలడు. అంతకు ముందు చేసిన సినిమాలు పక్కన పెడితే… జవాన్ సినిమాను సౌత్ హీరోలతో చేసి ఉంటే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచేది. నార్త్ వాళ్లకు జవాన్ కొత్తగా అనిపించింది… కానీ సౌత్ వాళ్లకు అన్ని సినిమాలను మిక్సీలో వేసినట్టుగా అనిపించింది. అలాంటి అట్లీ… బన్నీతో కొత్త కథ చేస్తే ఓకే గానీ జవాన్ లాంటి రొటీన్ సినిమా చేస్తే కుదరదు. పుష్ప2 తర్వాత బన్నీ నుంచి అంతకుమించి అనేలా సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడున్న బన్నీ క్రేజ్‌కు అట్లీ ప్రాజెక్ట్ అనవసరమనే చెప్పాలి.