NTV Telugu Site icon

Allu Arjun: బన్నీకి భారీ పారితోషికం.. ప్రభాస్‌కి మించి?

Allu Arjun Remuneration

Allu Arjun Remuneration

Allu Arjun Taking Huge Remuneration For Sandeep Reddy Vanga Project: సాధారణంగానే ఒక హిట్ పడగానే మన హీరోలు తమ పారితోషికాన్ని పెంచేస్తుంటారు. అలాంటిది.. పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు రావడంతో పాటు అదే రేంజ్‌లో మార్కెట్ వ్యాల్యూ పెరిగితే ఊరికే ఉంటారా? కచ్ఛితంగా తమ పారితోషికాన్ని అమాంతం పెంచేస్తారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే పని చేసినట్లు తెలుస్తోంది. ‘పుష్ప’తో తనకు పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో పాటు గనణీయంగా మార్కెట్ వ్యాల్యూ పెరగడంతో.. బన్నీ ఏకంగా వంద కోట్లకు పడగలెత్తినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే అతడు పుష్ప 2 సినిమాకి గాను రూ.100 కోట్లు అందుకుంటున్నాడని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని గాను బన్నీ రూ.125 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడని సమాచారం.

Lesbian Partner : పెళ్లయిన నెలకే కొత్త పెళ్లి కూతురు జంప్.. కాకపోతే అబ్బాయితో కాదు

‘అర్జున్ రెడ్డి’ని రూపొందించిన సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో బన్నీ ఓ ప్రాజెక్ట్‌కి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే! టీ సిరీస్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికే బన్నీ రూ.125 కోట్లు చార్జ్ చేస్తున్నాడని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ, ఒకవేళ ఇది నిజమైతే మాత్రం.. ప్రభాస్‌ని బన్నీ అధిగమించినట్టే! ‘బాహుబలి’ పుణ్యమా అని పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్.. అప్పటి నుంచి తాను చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులకు రూ.100 నుంచి రూ.120 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్టు టాక్ ఉంది. ఇప్పుడు అతని కంటే రూ.5 కోట్లు ఎక్కువ అమౌంట్‌తో.. బన్నీ అగ్రస్థానంలోకి వచ్చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Virat Kohli: కోహ్లీ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా..

Show comments