Allu Arjun: ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు.. బన్నీ ఏమన్నాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ అవార్డ్ విన్ అయిన సంతోషంలో ఉన్న విషయం తెల్సిందే. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక 68 ఏళ్ళలో నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డును సాధించాడు. దీంతో అల్లు వారింట సంబురాలు అంబరాన్ని అంటాయి అన్న విషయం తెల్సిందే. నిన్ననే మీడియావారికి సైతం బన్నీ పార్టీ ఇచ్చాడు. ఇక అభిమానులు ఇప్పటికీ బన్నీకి విషెస్ చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే .. టాలీవుడ్ కు అవార్డు రావడంతో హిందీ మీడియా ఓర్చుకోలేక.. కొన్ని పుకార్లు రేకెత్తించాయి. అందులో ఒకటి.. ఒక స్మగ్లర్ గా నటించిన హీరోకు అవార్డు రావడం ఏంటి.. ? దాన్ని ప్రభుత్వం ఎలా ఒప్పుకుంది అని ప్రశ్నిస్తున్నారు. పుష్ప సినిమాలో బన్నీ .. ఒక స్మగ్లర్. గంధపు చెక్కలను పోలీసుల కన్ను కప్పి.. లక్షల్లో అమ్మి సొమ్ము చేసుకుంటాడు. అదే పుష్ప కథ. దీంతో అభిమానులు బాలీవుడ్ మీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్కడ చూడాల్సింది పాత్రను కాదు.. నటనను.. ప్రభుత్వం చూసింది నటనను అని చెప్పుకొచ్చారు. తాజాగా బన్నీ కూడా ఇదే విషయం చెప్పుకొచ్చాడు.
Buchhibabu Sana: బుచ్చిబాబు.. చరణ్ సినిమాతో నీ దశ తిరిగిందయ్యా..
Also Read
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
- Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా 'బాహుబలి' ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
” ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు..? అని నేను అనుకున్నాను.. కానీ, ఇక్కడ లాజిక్ చూడడానికి ఏమి లేదు. లాజిక్ లు వెతక్కుండా జూరీ నటనకు పట్టం కట్టింది. నేను ఈ పాత్రను చేయడానికి చాలా ఆలోచించాను. సాధారణంగా మన భారతీయ సినీ పరిశ్రమలో కమర్షియల్ సినిమాను వేరుగా.. పెర్ఫామెన్స్ ఉన్న సినిమాలను వేరుగా చూస్తారు. కమర్షియల్ అనగానే నటన గురించి పట్టించుకోరు. నేను ఈ సినిమాను అలాగే తీయాలనుకున్నాను. కమర్షియల్ సినిమాలో కూడా పెర్ఫామెన్స్ చేయాలి అనుకున్నాను. అందుకు నాకు ఉదాహరణగా నిలిచిన సినిమాలు రుద్రవీణ, ఘరానా మొగుడు. పెర్ఫామెన్స్ అనగానే రుద్రవీణ గుర్తొస్తుంది.. కమర్షియల్ అంగన్ ఘరానా మొగుడు గుర్తొస్తుంది. ఈ రెండు కలిఫై పుష్ప సినిమాలో చేయాలనుకున్నాను. చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగినవాడిగా ఆ రెండు సినిమాలు మైండ్ లో పెట్టుకొని పుష్ప చేశాను. ఇక ఇక్కడ ఇండస్ట్రీకి మనం బలమా.. ? మనకు ఇండస్ట్రీ బలమా..? అనేది కూడా ముఖ్యం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!