నాకు ఆయనే వెంకటేశ్వరస్వామి – అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప’ మూవీ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప కి మాస్సివ్ హిట్ అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిత్తూరులో పుష్ప మాస్సివ్ సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ” చిత్తూరు భాషను రెండు సంవత్సరాలు నుంచి నేర్చుకొని ఈ సినిమా చేశాను.. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నేర్చుకొని సినిమా లో నటించాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క ఫంక్షన్ అయినా చిత్తూరు లో జరగాలని కోరుకున్నాను. ఈ సక్సెస్ పార్టీ చిత్తూరులో జరగడం చాలా ఆనందంగా ఉంది.
ఏడు కొండల స్వామి మీ అందరి వెనుక ఎలా ఉన్నాడో.. నా వెనుక సుకుమార్ అలా ఉన్నాడు.ఆయనే నా వెంకటేశ్వరస్వామి.. ఇవాళ నాకు ఎంత పేరు వచ్చినా.. ఏదీ వచ్చినా అది సుకుమార్ కే చెందాలి. అంతగా నాకు విజయాన్ని అందించిన సుకుమార్ కి థాంక్స్.. ఇక రష్మికతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. శ్రీవల్లిగానే కాకుండా రష్మిక లాగ కూడా ఆమె నాకు ఇష్టం.. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమాను ఇంత ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మధ్యలో చిత్తూరు భాషల్లో అల్లు అర్జున్ మాట్లాడడం ఈ ప్రోగ్రాం కి హైలెట్ గా నిలిచింది. చివర్లో పుష్పలోని మాస్ డైలాగ్స్ ని చెప్పి బన్నీ, ప్రేక్షకులకు ఆనందాన్ని పంచాడు.
Also Read
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!