Site icon NTV Telugu

Allu Arjun : దుబాయ్ లో దిగిన ఐకాన్ స్టార్..

Allu Arjun

Allu Arjun

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్ కు వెళ్లారు. తాజాగా తన తమ్ముడు శిరీష్‌ తో కలిసి దుబాయ్ కు పయనం అయ్యారు. దుబాయ్ లో ఐకాన్ స్టార్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్ లో గామా అవార్డుల వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆ అవార్డు అందుకోవడం కోసం ఆయన దుబాయ్ ఫ్లైట్ ఎక్కారు.

Read Also : Little Hearts : లిటిల్ హార్ట్స్.. పెద్ద సినిమాలను ఓడించిన కంటెంట్

అలాగే నేషనల్ క్రష్ రష్మక కూడా దుబాయ్ కు వెళ్లింది. పుష్ప సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికయింది. ఈ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు ఆమె వెళ్లింది. ఇక ప్రగ్యాజైస్వాల్, పాయల్ రాజ్ పుత్ కూడా దుబాయ్ కు వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కు ఇప్పటికే పుష్ప-2 సినిమాకు గాను గద్దర్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

Read Also : Navdeep : నవదీప్ ఇమేజ్ డ్యామేజ్.. అనవసరంగా జడ్జిగా వెళ్లాడా..?

Exit mobile version