Site icon NTV Telugu

Allu Arjun : చిరంజీవి మాటలకు ఏడ్చేసిన బన్నీ

Allu Arjun

Allu Arjun

Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌, సురేఖ వచ్చారు. వీరితో పాటు మెగా హీరోలు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు నాగవంశీ, నవీన్ యెర్నేని లాంటి వారు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. ఏర్పాట్ల గురించి చిరు, చరణ్‌ దగ్గరుండి తెలుసుకున్నారు. ఇక చిరంజీవి పక్కన అల్లు అర్జున్ వెళ్లి కూర్చున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చెప్పిన మాటలకు బన్నీ ఎమోషనల్ అయ్యారు. ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Read Also : Chiranjeevi – Allu Arjun : పాడె మోసిన చిరంజీవి, అల్లు అర్జున్

ఇక చిరంజీవి, అల్లు అర్జున్ స్వయంగా పాడె మోశారు. కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ ను పట్టుకుని అయాన్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. అంత్యక్రియల కోసం వచ్చిన వారిని అయాన్ పట్టుకుని ఎమోషనల్ అయిన వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కుటుంబానికి సెలబ్రిటీలు, పొలిటీషియన్లు చాలా మంది సంతాపం తెలుపుతున్నారు. కనకరత్నమ్మ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆమె కన్నుమూశారని అల్లు అరవింద్ కుటుంబం తెలిపింది.

Read Also : Vishal : దాని కోసమే ఇన్నేళ్లు పెళ్లి చేసుకోలేదు.. విశాల్ కామెంట్స్

Exit mobile version