Niharika Konidela: మొన్న చైతన్య.. నేడు నిహారిక.. ఏంటీ విడాకుల గోల..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niharika Konidela: చిత్ర పరిశ్రమలో నటుల వ్యక్తిగత జీవితాలు చాలా గందరగోళంగా ఉంటాయి. ఎంత త్వరగా ప్రేమిస్తారో.. అంతే త్వరగా బ్రేకప్ చెప్పుకుంటారు. ఇక ఎప్పుడు.. ఎవరు పెళ్లి చేసుకుంటారో.. ఎందుకు విడాకులు తీసుకుంటారో కూడా తెలియదు. ఇక గత కొన్ని రోజుల నుంచి మెగా డాటర్ నిహారిక విడాకుల రూమర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మూడేళ్ళ క్రితం నిహారిక, జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. ఉదయ్ పూర్ లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు మెగా బ్రదర్స్. ఇక వివాహం తరువాత నిహారిక వెండితెరకు దూరమైనా సినిమా రంగానికి మాత్రం దగ్గరగానే ఉంది. నటి నుంచి నిర్మాతగా మారింది. వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ మంచి హిట్ లనే అందుకుంది. భర్తతో వెకేషన్స్, పార్టీలు.. ఇలానిత్యం నిహారిక సోషల్ మీడియా నిండా భర్త చైకు సంబంధించిన ఫొటోలే ఉండేవి. దీంతో అభిమానులు చూడముచ్చటైన జంట.. త్వరలో తీపి కబురు చెప్పాలి అంటూ కామెంట్స్ కూడా పెట్టేవారు.
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ జంట మధ్య విబేధాలు తలెత్తాయని వార్తలు గుప్పుమన్నాయి. ఆ తరువాత ఈ పుకార్లు నిజం చేసేలా చైతన్య.. తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశాడు.. అంతేకాకుండా ఆమెను అన్ ఫాలో చేశాడు. అక్కడి నుంచి ఈ జంట విడాకులు తీసుకున్నది అన్న వార్తలు మరింత మారుమ్రోగిపోయాయి. ఇక తాజాగా నిహారిక సైతం తన భర్తతో ఉన్న అన్ని ఫోటోలను డిలీట్ చేసింది. కానీ, ఒక్క ఫోటోను మాత్రం వదిలిపెట్టింది. పెళ్ళిలో చై తో కలిసి ఉన్న ఒక్క ఫోటోను మాత్రమే డిలీట్ చేయలేదు. అది మాత్రం ఎందుకు డిలీట్ చేయలేదు అనేది మిస్టరీగా మారింది. ఇక ఆ ఫోటో కింద ఉన్న క్యాప్షన్ కూడా చాలా ఆసక్తిగా ఉంది. ” నా దగ్గర ఒక రహస్యం ఉంది. అది మీకు చెప్తే అది రహస్యం ఎందుకు అవుతుంది. దాన్ని నేను చెప్పలేను.. క్షమించండి” అని ఉంది. దీంతో కావాలనే ఈ ఫోటోను నిహారిక డిలీట్ చేయకుండా ఉంచింది అని, ఆ రహస్యం ఏంటి అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి ఈ విడాకుల వార్తలపై మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!