‘పుష్ప ది రైజ్ సినిమా’తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్, ఇప్పుడు రష్యాలో కూడా తన హవా చూపించడానికి బయలుదేరాడు. సినీ అభిమానులంతా ‘పుష్ప ది రూల్’ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటే, ‘పుష్ప పార్ట్ 1’ని రష్యాలో రిలీజ్ చేస్తున్నాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ అందరికీ స్వీట్ షాక్ ఇచ్చారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపు, రష్యన్ భాషలో ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.
డిసెంబర్ 8న ‘పుష్ప ది రైజ్’ రష్యాలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. విడుదలకి ఇంకో వారం మాత్రమే సమయం ఉండడంతో ‘పుష్ప ది రైజ్’ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రష్యా చేరుకున్నారు. అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక అండ్ టీంకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్బర్గ్ లో మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. పుష్ప పార్ట్ 1కి వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తే, అది పార్ట్ 2కి ఉపయోగ పడుతుందనే ఉద్దేశంతోనే ‘పుష్ప ది రైజ్’ని రష్యాలో రిలీజ్ చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడి ఆడియన్స్ ని ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుందో చూడాలి.