Allu Arjun: ఆడవారు దేన్నైనా భరిస్తారు కానీ తన భర్తను వేరొకరితో షేర్ చేసుకోవడం మాత్రం సహించరు అని చాలామంది అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి పోసిసివ్ నెస్ ఎక్కువ ఉంటుందని, తాము ప్రేమించేవారు వేరొకరితో మాట్లాడితే వారికి కోపం వస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో తారలు కూడా ఏమి తీసిపోరు. అప్పుడెప్పుడో జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్, ప్రీతి జింటాను కౌగిలించుకొని మాట్లాడుతుంటే జెనీలియా ఇచ్చిన రియాక్షన్స్ మాములుగా ఉండవు. అందుకు సంబంధించిన వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఈసారి జెనీలియా ప్లేస్ లో స్నేహారెడ్డి ఉండగా.. రితేష్ ప్లేస్ లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు. ఇటీవలే న్యూయార్క్ లో తెలుగు ఖ్యాతిని పెంచడానికి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో పాల్గొనడానికి బన్నీ వెళ్లిన విషయం తెల్సిందే.
బన్నీతో పాటు అతని అందాల భార్య స్నేహ రెడ్డి కూడా పక్కనే ఉంది. ఈ పెరేడ్ లో బన్నీని అందరు పలకరిస్తూ ఉండగా అప్పుడే అక్కడకు మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధూ అక్కడికి వచ్చింది. బన్నీని చూడగానే హయ్ అంటూ చేయి ఇచ్చి పలకరించడంతో పుష్ప రాజ్ కూడా నవ్వుతూ పలకరించాడు. ఇక ఆ సీన్ చూసిన స్నేహ ముభావంగా ముఖం తిప్పుకొని నిలబడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో స్నేహ అలిగిందో లేదో తెలియదు కానీ ఆమె క్యాజువల్ గా చూసిన లుక్ ను నెటిజన్స్ మాత్రం పోసిసివ్ నెస్ లుక్ అని కన్ఫర్మ్ చేసేసారు. ఏంటి బన్నీ.. పక్కన భార్యను పెట్టుకొని ఏంటా పనులు అంటూ వీడియోకు కామెంట్స్ కూడా పెట్టుకొచ్చేస్తున్నారు. ఇక మరికొందరు ఒరేయ్ బాబు ఆపండ్రా.. అక్కడ ఏమి లేదు.. ఆమె మర్యాద పూర్వకంగా పలకరించింది.. బన్నీ కూడా హాయ్ చెప్పాడు. దాన్ని పెద్ద ఇష్యూ చేయకండి అంటూ చెప్పుకొస్తున్నారు.