లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేసాడు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని సమంతా కిక్ స్టార్ట్ చేసింది. ఇటివలే సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతా, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా గురించి ఇంటరెస్టింగ్ విషయాలని చెప్పింది. శాకుంతలం సినిమాలో శాకుంతలా దేవి, దుష్యంత మహారాజు కొడుకు భరతుడిగా చైల్డ్ క్యారెక్టర్ లో అల్లు అర్హా నటించింది. శాకుంతలం క్లైమాక్స్ లో వచ్చే ఈ స్పెషల్ సీన్ లో అల్లు అర్హా చాలా బాగా నటించిందని చెప్తూ సమంతా “అల్లు అర్హా చాలా క్యూట్ గా ఉంటుంది. తనకి అసలు ఇంగ్లీష్ రాదు, పేరెంట్స్ తనని అంత రూటెడ్ గా పెంచారు. హాయ్ కూడా నార్మల్ గానే చెప్తుంది. సెట్ లో అందరి ముందు పెద్ద డైలాగ్ ఇచ్చినా భయపడకుండా అర్హా భలే చెప్పింది. అల్లు అర్హా అస్సలు తగ్గేదే లే, తను బోర్న్ సూపర్ స్టార్” అంటూ అర్హాకి సామ్ కాంప్లిమెంట్స్ ఇచ్చింది. సమంతా లాంటి స్టార్ హీరోయిన్ నుంచి అల్లు అర్హా కాంప్లిమెంట్స్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. శ
కుంతల, దుష్యంత మహారాజు విడిపోయిన తర్వాత, దుష్యంతుడు ఇంద్రుడి తరపున, దేవతల తరపున రాక్షకులతో యుద్ధం చెయ్యడానికి దుష్యంతుడు స్వర్గానికి వెళ్తాడు. స్వర్గంలో దేవతల తరపున పోరాడి, వాళ్లని గెలిపిస్తాడు దుష్యంతుడు. ఈ యుద్ధం గెలిచి తిరిగి తన రాజ్యానికి వెళ్తున్న దుష్యంతుడు, ‘మరీచ మహర్షి’ ఉన్న ‘హిమకుట పర్వత’ సౌందర్యానికి ఆకర్షితుడు అవుతాడు. తన రథాన్ని ‘హిమకుట’ పర్వతం పైన ఆపిన దుష్యంతుడు… అక్కడ ఒక బాలుడు, సింహానికి ఎన్ని పళ్ళు ఉన్నాయి అనేది లెక్క పెడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఆ బాలుడి తల్లి పేరు శకుంతల అని, అతను పురు వంశానికి చెందిన వాడు అని తెలుసుకుంటాడు. ఆ బాలుడు తన కొడుకు అని దుష్యంతుడు గుర్తించగానే శకుంతల ప్రత్యక్షం అవుతుంది. ఆమెని చూడగానే దుష్యంతుడు తన గతాన్ని మర్చిపోయిన విషయం చెప్పి, శకుంతలనని క్షమించమని అడుగుతాడు. ఆ బాలుడిని, దుష్యంతుడిని మరీచ మహర్షి ఆశీర్వదించి తిరిగి తమ రాజ్యానికి పంపిస్తాడు. ఆ బాలుడే ‘భరతుడు’ అతని పేరు పైన ‘భరత రాజ్యం’ ఏర్పడింది. ఇలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో అల్లు అర్హా ఎలా నటించిందో ఆడియన్స్ కూడా ఏప్రిల్ 14న చూడబోతున్నారు.