Allu Aravind Video With Lavanya Tripathi Going Viral: సెలెబ్రిటీల ప్రేమ వ్యవహారాలనేవి.. ఎక్కువకాలం దాగి ఉండవు. ఎలాగోలా వారి బాగోతం బట్టబయలవుతుంది. ఎక్కడో ఒక చోట కెమెరాకి చిక్కడమో, లేక ఇండస్ట్రీ వర్గాల నుంచే లీకులు రావడమో జరుగుతుంది. కానీ.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల విషయంలో మాత్రం అలాంటి లీకేజీలు పెద్దగా రాలేదు. ఆమధ్య ఓసారి వీళ్లు ప్రేమలో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగింది కానీ, ఆ వెంటనే అది కనుమరుగైంది. ఎవ్వరూ స్పందించకపోవడం, అందుకు హింట్స్ కూడా లేకపోవడంతో.. అది కేవలం రూమరేనని అందరూ అనుకున్నారు. కానీ.. ఈ జంట నిశ్చితార్థం చేసుకొని ఒక్కసారిగా షాకిచ్చింది. తాము నిజంగానే ప్రేమలో ఉన్నామని, పెళ్లిపీటలు కూడా ఎక్కబోతున్నామని.. ఎంగేజ్‌మెంట్‌తో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. 2016 నుంచే తమ ప్రేమాయణం కొనసాగుతోందంటూ.. ఇద్దరు నిశ్చితార్థం తర్వాత బట్టబయలు చేశారు.
Devara: దేవరపై ఇంట్రెస్టింగ్ రూమర్.. ఆ హాలీవుడ్ సినిమాకు ఇన్స్‌పిరేషనా?
ఇదిలావుండగా.. వరుణ్, లావణ్య నిశ్చితార్థం జరిగిన తర్వాత అల్లు అరవింద్‌కి సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. అది ‘చావుకబురు చల్లగా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించిన వీడియో. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పించారు. అందుకే.. ఆ ఈవెంట్‌కి ఆయన గెస్టుగా విచ్చేశారు. వేదికపై లావణ్య త్రిపాఠి తెలుగులో ప్రసంగిస్తుండగా.. వెంటనే అల్లు అరవింద్ ఆమె వద్దకు చేరుకున్నారు. మైక్ అందుకొని.. ‘‘ఎక్కడో నార్త్ నుంచి వచ్చిన లావణ్య తెలుగు నేర్చుకొని, చాలా బాగా మాట్లాడుతోంది. ఓ తెలుగు కుర్రాడ్ని చేసుకొని, ఇక్కడే సెటిలైతే బాగుంటుంది కదా’’ అని చెప్పారు. అప్పుడు ఆయన ఏదో మాట వరసకి అలా అనేశారు. ఇప్పుడు లావణ్య అదే నిజం చేసి చూపించిందని.. నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. అల్లు అరవింద్ కుటుంబానికి చెందిన కుర్రాడినే ప్రేమించి, మెగా కోడలు కాబోతోంది.
Arjun – Shruti Case: అర్జున్-శృతి ‘మీటూ’ కేసులో కొత్త ట్విస్ట్.. శృతికి కోర్టు నోటీసులు
ఇదిలావుండగా.. 2016లో శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్’ సినిమా షూటింగ్ సమయంలో లావణ్య, వరుణ్ తేజ్ మధ్య పరిచయం ఏర్పడింది. అది కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారింది. అప్పటి నుంచి సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఎక్కడా తమ బాగోతం బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ జంటకు ఎవరి దిష్ట తగలకూడదని, కలకాలం హ్యాపీగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.