‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’ అంటూ బాలయ్య హోస్ట్ గా నిర్వహించబోయే టాక్ షోకు సంబంధించిన ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈరోజు ‘ఆహా’ 1.5 మిలియన్ సబ్ స్క్రయిబర్స్ ను సొంతం చేసుకుని, ఇయర్ ఎండ్ కు 2 మిలియన్ సబ్ స్క్రయిబర్స్ ఉండాలనే టార్గెట్ తో పని చేస్తున్నారు టీం. ‘ఆహా’ సక్సెస్ ను ఇండియా మొత్తం ఆశ్చర్యంగా చూస్తోంది. ఒక ప్రాంతీయ భాషలో ప్రసారం చేస్తున్న ఓటిటికి ఏమిటి ఈ సక్సెస్ అని ! అనేక భాషలను మిక్స్ చేస్తున్న దిగ్గజ సంస్థలు కూడా పొందలేని సక్సెస్ ను ‘ఆహా’ పొందింది. దీనంతటికి కారణం తెలుగు ప్రేక్షకులు. తెలుగు వారి ఉత్సాహానికి, ఎనర్జీకి ఒక ఉదాహరణ. తెలుగు వారు ఎంటెర్టైన్మెంట్ కు ఇచ్చే ప్రాధాన్యత ఇది. తెలుగు వారి గౌరవాన్ని దేశవ్యాప్తంగా నిలబెట్టేలా ఈ షో ఉంటుందని మీకు మాట ఇస్తున్నాను” అంటూ ‘ఆహా’ అసలు టార్గెట్ ఏంటో వెల్లడించారు అల్లు అరవింద్.
Read Also : ‘అన్స్టాపబుల్’ బాలయ్య… స్టార్టింగ్ లోనే అల్లు అరవింద్ పై సెటైర్