ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రం హాస్యం, రహస్యం, యవ్వన శక్తి మిశ్రమంగా ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరు వెండితెరపై నవ్వుల టపాసులు పేల్చబోతున్నారు. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతగా సోమరాజు పెన్మెత్స వ్యవహరిస్తున్నారు.
కాగా ఈ సినిమా ట్రైలర్ ను కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్. మిత్ర మందలి ట్రైలర్ ను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తీసుకువచ్చారు మేకర్స్. ఒక స్ట్రిక్ట్ ఫాదర్. ఆయనకి ఒక కూతురు ఆమె కోసం గొడవపడే ముగ్గురు స్నేహితులు వంటి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ట్రైలర్ లో వెన్నెల కిషోర్ కామెడీ సూపర్బ్ గా ఉంది. ఇక ఇంపోర్టెంట్ క్యారక్టర్ లో నటించిన సత్య పాత్ర కూడా నవ్వులు పూయించింది. తమిళ హాస్య నటుడు వీటివి గణేష్ తనదైన వాయిస్ తో చెప్పిన ఎవడ్రా సుబ్బారావు సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. మధ్యలో జాతిరత్నాలు దర్శకుడు KV అనుదీప్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఓవరాల్ గా మిత్ర మండలి ట్రైలర్ చాలా బాగుందనే చెప్పాలి. ఏప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ప్రేక్షకులు థియేటర్లలో నవ్వులతో నిండిన దీపావళి పండుగను చేసుకునేలా ‘మిత్ర మండలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కాబోతుంది.
Also Read : NBK : బ్రాండ్ అంబాసిడర్ గా బాలయ్య కుమార్తె.. షూటింగ్ ఫినిష్