రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ తో పాటు మిగిలిన మూవీ లవర్స్ కూడా థియేటర్స్ కి వెళ్లిపోయి… థియేటర్స్ కి మ్యూజికల్ కాన్సర్ట్స్ గా మార్చేశారు. ఆరెంజ్ సినిమాలోని ప్రతి పాటని థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ పాడుతూ గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘వారణం ఆయిరం’, తెలుగులో ఈ సినిమా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ పేరుతో రిలీజ్ అయ్యింది. 2008 నవంబర్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా సెన్సేషన్ సృష్టించింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సూపర్ హిట్ అయ్యింది. హరీష్ జైరాజ్ ఇచ్చిన సాంగ్స్ ని ఇప్పటికీ వినే మ్యూజిక్ లవర్స్ ఉన్నారు అంటే సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఆల్బమ్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రతికేయించి చెప్పాల్సిన అవసరం లేదు.
తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్, రెండు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్, అంతకన్నా అద్భుతమైన సాంగ్స్, సూర్య చూపించిన వేరియేషన్స్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ టేకింగ్ అన్నీ కలిసి సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాని ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా మార్చాయి. ఈ రేంజ్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో రిలీజ్ అవ్వలేదు. జులై 23న సూర్య పుట్టిన రోజున సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాని రీరిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ అది వాయిదా పది ఆగస్టు 4న రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బుకింగ్స్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఒక తమిళ డబ్బింగ్ సినిమా రీరిలీజ్ కి ఈ రేంజ్ బుకింగ్స్ ని చూడడం ఇదే మొదటిసారి. ఆగస్టు 4న యూత్ అంతా థియేటర్స్ కి వెళ్లి సాంగ్స్ ని హమ్ చేస్తే ఒక మ్యూజికల్ కాన్సర్ట్ గుర్తు రావడం ఖాయం.