బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇటీవలే తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ లో ఆమె ప్రేమించిన ప్రియుడు రణబీర్ కపూర్ ను అత్యంత వైభవంగా వివాహమాడిన విషయం విదితమే.. పెళ్లి అయ్యి మూడు నెలలు కూడా ముగియకముందే మేము తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించారు ఈ జంట.. ఇక ఈ వార్త బీ టౌన్ లోనే కాకుండా చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. అప్పుడే అలియా తల్లి అవ్వడం ఏంటీ..? రణబీర్ ఏమి అనలేదా..? అయితే అలియా సినిమాల పరిస్థితి ఏంటి..? ఆమె ప్లేస్ లో మరొకరిని రీప్లేస్ చేస్తారా..? సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాల గతి ఏం కాను..? .. ఇంకా ఆమె సినిమాలు ఆలస్యం కానున్నాయి..?అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
ఇక తాజాగా ఒక వెబ్ మీడియా ఇదే ప్రశ్నను సంధిస్తూ ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది. అలియా ప్రెగ్నెంట్ అయ్యింది.. మరి తన తదుపరి సినిమాల పరిస్థితి ఏంటి ..? అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ వార్తలపై అలియా ఆగ్రహం వ్యక్తం చేసింది. “ప్రెగ్నెంట్ అయితే షూటింగ్ చేయకూడదా..? షూటింగ్ చేయాలా..? వద్దా..? అనేది నా ఇష్టం. అది నా వైద్యులు చెప్తారు. వారు వద్దు అన్నప్పుడు మానేస్తాను. ఈ వార్తల్లో వచ్చినట్లు నా సినిమాలు ఏమి ఆలస్యం కావు. షూటింగ్ లేమి క్యాన్సిల్ కూడా కాలేదు. నేను షూటింగ్ లో పాల్గొంటున్నాను. అయినా మీరు ఏ కాలంలో ఉన్నారు.. ముందు మీరు ఆలోచించే విధానం మార్చుకోండి. ఇక నా గురించి, నా ప్రెగ్నెన్సీ గురించి వదిలేస్తే నేను షూటింగ్ చేసుకుంటాను” అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది. ఇకపోతే ప్రస్తుతం అలియా నటించిన బ్రహ్మాస్త్ర విధులకు సిద్ధమవుతుండగా.. హాలీవుడ్ సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ షూటింగ్ జరుపుకొంటుంది.