2012లో వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’కు సీక్వెల్ కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఖిలాడీ ‘దేవుడి’ పాత్రలో చేసిన ఫన్ కి, ఇచ్చిన సోషల్ మెసేజ్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘ఓ మై గాడ్ 2’ ఆగస్టు 11న రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్షయ్ కుమార్ సీక్వెల్ లో నటిస్తుండగా, పరేష్ రావల్ ప్లేస్ లో పంకజ్ త్రిపాఠీ వచ్చి చేరాడు. ఇందులో యామీ గౌతమ్ ఓ కీలక పాత్ర పోషించబోతోంది. ఈ చిత్రానికి అమిత్ రాజ్ రచన చేసి దర్శకత్వం వహిస్తున్నారు. విపుల్ డి షా, రాజేశ్ బెహల్, అశ్విన్ వార్దే ‘ఓఎంజీ -2’ను నిర్మిస్తున్నారు. ఖిలాడీ ఫాన్స్ కి కిక్ ఇస్తూ OMG 2 టీజర్ ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. నిమిషమున్నర మాత్రమే ఉన్న ఈ టీజర్ లో అక్షయ్ కుమార్ శివుడిగా, పంకజ్ ఆయన భక్తుడిగా కనిపించాడు. సోషల్ మెసేజ్ ఉండే ఎలిమెంట్ ని కచ్చితంగా సినిమాకి కలుపుతారు కానీ అది టీజర్ లో అయితే చూపించలేదు.
అక్షయ్ కుమార్ లాంగ్ హెయిర్ తో కొత్తగా కనిపించాడు, టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కొట్టారు. అందుకే అక్షయ్ కుమార్ కనిపించిన సమయంలో మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. ముఖ్యంగా టీజర్ లో అక్షయ్ కుమార్ ఒక ఇంటి నుంచి బయటకి నడుచుకుంటూ వెళ్తుంటే, ఆయన వెనక నంది ఫాలో అయ్యే షాట్… టీజర్ కే హైలైట్ గా నిలిచింది. ఇక పంకజ్ త్రిపాఠిలో అమాయకపు పాత్ర ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ భక్తుడికి వచ్చిన ఏ కష్టాన్ని తీర్చడానికి శివుడు కైలాసం నుంచి దిగి వచ్చాడో చూడాలి. గత కొంతకాలంగా అక్షయ్ కుమార్ ఏ సినిమా చేసినా అది బాక్సాఫీస్ దగ్గర బోర్లాపడుతుంది. ఈసారి మాత్రం అలా అయ్యేలా కనిపించట్లేదు. ఆల్రెడీ ఉన్న పాజిటివ్ బజ్, నార్త్ లో ఉన్న భక్తి సినిమాల ట్రెండ్, టీజర్ క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్… అన్నీ కలిసి OMG 2ని హిట్ అయ్యేలా చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది.
रख विश्वास 🙏#OMG2Teaser out now. #OMG2 in theatres on August 11. pic.twitter.com/huoKuAIKw9
— Jolly Mishra – Asli Jolly from Kanpur (@akshaykumar) July 11, 2023