Akkineni Nagarjuna: నా సినిమాకు స్టార్ అంటే అతనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా అలరిస్తున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున అక్కినేని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
‘నా సామిరంగ’మీ కెరీర్ లో వేగంగా పూర్తి చేసుకున్న సినిమా అనుకోవచ్చా ?
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
షూటింగ్ డేట్ నుంచి మొదలుపెడితే రిలీజ్ డేట్ కి చిత్రీకరణ వేగంగా జరుపుకున్న సినిమా అనొచ్చు. వర్కింగ్ డేస్ లో మాత్రం కాదు. చాలా సినిమాలు 35రోజుల్లో చేశాం. ‘నా సామిరంగ’ 72 రోజుల చిత్రీకరణ చేశాం. నేను 60 రోజులు పని చేశాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే.. ఇంత ఫాస్ట్ వర్క్ చేయడం సాధ్యపడుతుంది. ఈ చిత్రానికి చాలా మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. కీరవాణి గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ వుండటం మా అదృష్టం. మూడు పాటలు షూటింగ్ కి ముందే ఇచ్చేశారు. అలానే ఫైట్ సీక్వెన్స్ కి కూడా నేపధ్య సంగీతం చేశారు. నేపధ్య సంగీతం పెట్టుకొని ఫైట్ షూట్ చేశాం. ఇంత ఫాస్ట్ గా, ఇంత పెద్ద స్కేల్ లో చేశామంటే దానికి కీరవాణి గారు ఒక కారణం. ఇందులో ప్రతి పాట అద్భుతంగా వుంటుంది. మా సినిమాకి కీరవాణి గారే స్టార్.
‘నా సామిరంగ’ కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన అంశాలు ఏమిటి ?
అన్ని ఎలిమెంట్స్ నచ్చాయి. మంచి స్నేహం, ప్రేమ, త్యాగం, విశ్వాసం.. ఇలా హ్యూమన్ ఎమోషన్స్ కూడిన చాలా అద్భుతమైన కథ ఇది.
తెలుగు తెరపై తొలిసారి సంక్రాంతి ప్రభల తీర్ధం నేపధ్యాన్ని తీసుకున్నారు కదా ?
భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో జరిగే కథ ఇది. మనకి సంక్రాంతిపెద్ద పండగ. ఇది 80 నేపధ్యంలో జరిగే కథ. ఇది పండక్కి అందరూ చూడాల్సిన సినిమా.
ఇది మలయాళీ మూలకథ. వారి కథలు, పాత్రలు స్లోగా మొదలౌతాయి. తెలుగులో వచ్చేసరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
కథ సోల్ మిస్ అవ్వకుండా చేశాం. ఈ విషయంలో దర్శకుడు బిన్నీకి క్రెడిట్ ఇస్తాను. చాలా చక్కగా డిజైన్ చేశాడు. ప్రసన్న తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా చక్కగా మార్చాడు.
ఆషికా రంగనాథ్ గురించి ?
ఇందులో చాలా టిపికల్ లవ్ స్టొరీ వుంది. నేను కిష్టయ్య పాత్రలో కనిపిస్తాను. మా ఇద్దరి మధ్య 12 ఏళ్ళ నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. ముఫ్ఫై ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పరిచయమై మాట్లాడకుండానే వాళ్ళ ప్రేమకథ నడుస్తుంది. చాలా డిఫరెంట్ లవ్ స్టొరీ ఇది. ఆషికా చాలా చక్కగా నటించింది.
దర్శకుడు విజయ్ బిన్నీ గురించి ?
విజయ్ కి చాలా మంచి విజువల్ సెన్స్ వుంది. తను కొరియోగ్రఫీ చేసిన పాటలు చూశాను. డ్యాన్స్ లా కాకుండా పాటలోనే మంచి కథని చెప్పే నేర్పు తనలో వుంది. అది నాకు చాలా నచ్చింది. ఇది కథ తనకి ఇచ్చి ఎలా చేస్తావని చెప్పమన్నప్పుడు.. తను అనుకున్న పద్దతిలో చెప్పాడు. అది మా అందరికీ నచ్చింది. బిన్నీ చాలా క్లారిటీ వున్న దర్శకుడు.
అల్లరి నరేష్,రాజ్ తరుణ్ పాత్రల గురించి ?
విజయ్ బిన్నీ ప్రాజెక్ట్ లోకి రాకముందే నరేష్ పాత్రని అనుకున్నాం. సోదరభావం వున్న ఆ పాత్రకు నరేష్ కరెక్ట్ గా షూట్ అవుతారనిపించింది. అలాగే రాజ్ తరుణ్ ది కూడా కథలో కీలకమైన పాత్రే.
నా సామిరంగ టైటిల్ గురించి ?
నాన్న గారి పాట నుంచి వచ్చిన టైటిల్ ఇది. మన కథకు బాగా నప్పుతుందనిపించింది. సినిమాలో చాలా చోట్ల ఈ టైటిల్ వినిపిస్తూనే వుంటుంది.
అనుకున్న సమయానికి రెడీ చేయడం సవాల్ గా అనిపించిందా ?
నా కంటే ఎక్కువగా డైరెక్టర్, కెమరా డిపార్ట్మెంట్ రౌండ్ ది క్లాక్ పని చేశారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్, ఇలా అన్నీ విభాగాలు మంచి సమన్వయంతో పని చేశాయి.
యాక్షన్ సీక్వెన్స్ లో ఎలా ఉండబోతున్నాయి ?
చాలా మ్యాసీగా వుంటాయి. నా సినిమాల వరకూ నా సామిరంగ వెరీ మ్యాసీ అనే చెప్పాలి.
నిర్మాతల గురించి ?
శ్రీనివాస చిట్టూరి వండర్ ఫుల్ ప్రొడ్యూసర్. మా మధ్య మంచి బాండింగ్ వుంది. ఎక్కడా వెనకడుగు వేయరు. సినిమాకి కావాల్సిన ప్రతిది రాజీపడకుండా సమకూరుస్తారు.
మహేష్ బాబు గారి కలసి సినిమా చేసి, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు లెగసి ని కొనసాగించాలని గతంలో ఓ ట్వీట్ చేశారు కదా .. ఆ సినిమా చర్చలు జరుగుతున్నాయా ?
ఆయన రాజమౌళి గారితో సినిమా పూర్తి చేసిన తర్వాతే దాని గురించి ఆలోచించాలి.(నవ్వుతూ)
కొత్త సినిమా గురించి ?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!