Akkineni Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం భారీ విజయం కోసం చాలా కష్టపడుతున్నాడు. రెండేళ్లుగా చై ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఇకపోతే.. ఇప్పటికే చై.. కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చై ఫోకస్ అంతా దీనిమీదనే ఉంది. అయితే అభిమానుల ఆశలన్నీ కూడా చై వెబ్ సిరీస్ దూత మీద ఉన్నాయి. మొట్ట మొదటిసారి చై.. దూత సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందులోనూ తాను ఇప్పటివరకు చేయని హర్రర్ జోనర్ లో అనగానే అభిమానులు ఈ సిరీస్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చై కు మనం లాంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా.. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో చై సరసన పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచి దేశాయ్ నటించగా.. తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Mangalavaram: జీరో ఎక్స్‌పోజింగ్.. ట్విస్టులకు దిమ్మతిరుగుతుంది
ఇక ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్‌లుగా రానుందట. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుందని తెలుస్తోంది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో ఈ సిరీస్‌ను నిర్మించారని టాక్. డిసెంబర్ 1 నుంచి దూత.. అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చై.. దూత ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. చాలా ఏళ్లుగా చై అభిమానులు.. భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. అందరు హీరోలు పాన్ ఇండియా అంటూ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటే.. అక్కినేని హీరోలు మాత్రమే ఇంకా వెనకబడి ఉన్నారు. ఈ సిరీస్ కనుక హిట్ అందుకుంటే.. చై కెరీర్ కు ప్లస్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అన్ని అయిపోయాయి.. ఇక దీని మీదనే ఆశలన్నీ.. ఏం చేస్తావో ఏమో.. ? అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సిరీస్ తో చై ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.