Akhanda 2 Release Date: బాలయ్య అభిమానులకు శుభవార్త.. ‘అఖండ-2’ విడుదలకు లైన్ క్లియర్, రిలీజ్ ఎప్పుడంటే?
- బాలయ్య అభిమానులకు శుభవార్త
- 'అఖండ-2' విడుదలకు లైన్ క్లియర్
- డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం, నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ-2: తాండవం’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల మద్రాసు హైకోర్టు స్టే విధించగా.. ఈరోజు సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి.
నిజానికి అఖండ-2 మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందు రావాల్సి ఉంది. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఊహించని రీతిలో అడ్డంకి ఎదురైంది. ఫైనాన్షియల్ వివాదాల కారణంగా సినిమా రిలీజ్ ఆగింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి తమకు రూ.28 కోట్ల బకాయి ఉందని.. ఆ డబ్బు చెల్లించే వరకు అఖండ-2 సినిమాను నిలిపివేయాలని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాసు కోర్టును ఆశ్రయించింది. ఈరోస్ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. ఈ లోగా సినిమాకి సంబంధించి ఫైనాన్షియల్ అన్ని క్లియర్ అయ్యాయి. దాంతో సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేనొక్కడినే, ఆగడు చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొంది.
Also Read
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
- Kayadu Lohar: "రాయితో కొట్టి తల పగలగొట్టా".. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- Kalki Sequel: 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
Also Read: IND vs SA: భారత జట్టులో అతడితోనే మాకు బిగ్ టెన్షన్: మార్‌క్రమ్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ-2. అఖండకు ఇది సీక్వెల్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇందుకు సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్ అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. విషయం తెలిసిన బాలయ్య ఫాన్స్ సినిమా చూసేందుకు సిద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
Trump: ఇరాన్‌తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్‌ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!