Ajith- Shalini: షాలినిని పెళ్లి చేసుకోవద్దు.. అజిత్ కు వార్నింగ్ ఇచ్చిన నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajith- Shalini: కోలీవుడ్ స్టార్ కపుల్ అజిత్- షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన షాలిని ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ బిజీగా మారింది. ఇక వీరిద్దరి లవ్ స్టోరీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక సినిమాలో పరిచయమైన ఈ జంట ఆ తరువాత ప్రేమలో పడడం, ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహమాడారు. అయితే వీరి ప్రేమించుకున్నప్పుడు ఒక షాకింగ్ ఘటన జరిగిందట. షాలినిని పెళ్లి చేసుకోవద్దని నటుడు, దర్శకుడు రమేష్ ఖన్నా అజిత్ కు వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు.
Ritesh Agarwal: ఓయో ఫౌండర్ పెళ్లి.. గెస్ట్ లిస్ట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
Also Read
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
- Love And War : 'లవ్ అండ్ వార్'ను విడిచిపెట్టని లీక్స్
- The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
అజిత్- షాలిని వివాహమై 23 ఏళ్ళవుతుంది. బాలనటిగా షాలిని తన కెరీర్ ను మొదలుపెట్టింది, సఖి సినిమాతో హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ను అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఆమెకు అజిత్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ ఛాన్స్ ను షాలిని వద్దు అనుకుంది. వెంటనే ఆమె ఈ సినిమా చేయనని చెప్పడంతో దర్శకుడు శరన్.. అజిత్ నే షాలినిని ఒప్పించమని చెప్పాడట. దీంతో అజితే స్వయంగా షాలినికి ఫోన్ చేసి సినిమా చేయమని బతిమాలాడట. ఇక చాలాసేపు అలా బతిమాలించుకోవడం ఇష్టంలేని షాలిని సినిమా చేయడానికి ఒకే చెప్పిందట.. ఆ సినిమానే అద్భుతం. ఇక ఈ సెట్ లో అజిత్ వలన షాలిని మణికట్టుకు గాయమయ్యిందట. తనవలనే ఆ దెబ్బ తగిలిందని ఫీల్ అయిన అజిత్ రోజుకు నాలుగుసార్లు షాలిని కాల్ చేసి ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగేవాడట. అలా వారి పరిచయం ప్రేమగా మారింది. ఇక వీరి ప్రేమ వ్యవహారం తెలియని నటుడు, డైరెక్టర్ రమేష్ ఖన్నా.. వారిద్దరూ చనువుగా ఉండడం చూసి.. ” అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. షాలినిని పెళ్లి చేసుకుంటావా.. చేసుకోవద్దు.. నీ పని నువ్వు చూసుకో.. ఆమెను పట్టించుకోవద్దు” అని చెప్పాడట. ఇక ఆ విషయాలను అజిత్ పట్టించుకోకుండా షాలినిని వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడట. ఇక ఆ తర్వాత వారి ప్రేమ విషయం తెలుసుకున్నరమేష్.. స్వయంగా వారి పెళ్ళికి వెళ్లి బెస్ట్ విషెస్ చెప్పి వచ్చాడట. అలా ఈ జంట ఒక్కటి అయ్యారు. ప్రస్తుతం ఈ జంట లవ్ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్‌ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!