కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు ఓ వింత అలవాటు ఉంది. సాధారణంగా హీరోయిన్లను హీరోలు రిపీట్ చేస్తుంటే తలాకు మాత్రం దర్శకులతో రిపీటెడ్‌గా వర్క్ చేయడం హాబీగా మారింది. అజిత్‌కు నచ్చితే చాలు వరుస అవకాశాలు ఇస్తాడు. అలా శరణ్, శివ, వినోద్ ఈ ముగ్గురినీ స్టార్ డైరెక్టర్లను చేసాడు అజిత్ . కాదల్ మన్నన్, అమర్ కాలం, అట్టగాసం, అసల్ అలా నాలుగు సినిమాలు చేశాడీ దర్శకుడితో.
Also Read : KA10 : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక కంగువాతో సూర్యను కంగుతినిపించిన శివను స్టార్ డైరెక్టర్‌గా మార్చింది తల మూవీనే. శివతో కంటిన్యూగా ఫోర్ మూవీస్ చేశాడు అజిత్. వీరమ్, వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి వీ సెంటంటెమెట్ వర్కౌట్ చేసి కోలీవుడ్ స్టార్ హీరోకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు శివ. ఇక తలా ఆస్థాన దర్శకుడిగా మారిపోయాడు హెచ్. వినోద్. నీరకొండ పార్వయ్, వాలిమై, తనివు హిట్లతో అజిత్ కాంపిటీటర్ ఇళయదళపతి విజయ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొల్లగొట్టాడు. విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటోన్న తలపతి 69కి దర్శకుడు ఇతగాడే. అజిత్ స్టార్ డమ్‌కు కారకులైన ఈ ముగ్గురు ఇండస్ట్రీలో తమకంటూ యునిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ఫిల్మ్ మేకర్ రాబోతున్నాడని టాక్ నడుస్తోంది. అతడే అధిక్ రవిచంద్రన్. మార్క్ ఆంటోనీతో ఫ్రూవ్ చేసుకున్న ఈ యంగ్ ఫెలో అజిత్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీకి వర్క్ చేశాడు. అధిక్ మేకింగ్ స్టైల్, కమ్యూనికేట్ చేసే విధానం, సెట్‌లో యాక్టర్లతో బిహేవియర్ తలను ఆకట్టుకుందట. అదే అజిత్‌ను ఫ్లాట్ చేసింది. నెక్ట్స్ ఈ దర్శకుడికే ఛాన్స్ ఇస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.