Ajay Ghosh Comments At Music Shop Murthy Pre Release Event: చేసింది తక్కువ సినిమాలైనా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్ ఘోష్. పేరు వినడానికి నార్త్ పేరు లాగానే ఉన్న పక్కా తెలుగు నటుడాయన. గతంలో ఎన్నో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా ఎన్నో పాత్రలు పోషించినా పుష్ప సినిమాలో చేసిన కొండారెడ్డి అనే పాత్ర మాత్రం ఆయనకు ఎనలేని క్రేజ్ తెచ్చి పెట్టింది. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆయన ముఖ్య పాత్రలో మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఒక సినిమా తెరకెక్కింది. వయసు పైబడ్డ తర్వాత ఆర్జే అవ్వాలని కలలుగనే ఒక మ్యూజిక్ షాప్ ఓనర్ పాత్రలో ఆయన నటించాడు.
Dil Raju: గుండెల్లో, ఏముందో…కళ్ళల్లో తెలుస్తుంది.. భార్యతో దిల్ మామ ఫొటోషూట్ వైరల్
ఇక ఆ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అదేమిటంటే ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడండి సినిమా నచ్చకపోతే నాకు ఫోన్ చేసి బూతులు తిట్టండి అని చెబుతూ ఆయన నెంబర్ ని లైవ్ లో అనౌన్స్ చేశాడు. బహుశా ఇలా చేయగలిగిన నటులు చాలా తక్కువ మందే ఉండొచ్చు. గతంలో ఇలాంటి దాఖలాలు కూడా లేవు. కానీ తన సినిమా మీద ఉన్న నమ్మకంతోనే అజయ్ ఇలా నెంబర్ అనౌన్స్ చేసి ఉండొచ్చు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.