Ajay Devgan: హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బాలీవుడ్ లో పాన్ మసాలా యాడ్ పెద్ద చిచ్చే పెట్టింది. హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారని అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అభిమానుల ఆగ్రహానికి ఒక మెట్టు దిగిన అక్షయ్ వారికి సారీ చెప్పి, ఇకపై అలాంటి యాడ్స్ లో నటించనని మాట ఇచ్చాడు. ఇక తాజాగా ఈ వివాదంపై మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ స్పందించాడు. మొదటి నుంచి పాన్ మసాలా యాడ్స్ కి అజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న విషయం తెలిసిందే.
ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అజయ్ ఈ వివాదంపై మాట్లాడుతూ ” నిజం చెప్పాలంటే ఈ వివాదంపై నేను మాట్లాడనుకోవడంలేదు.. ఎందుకంటే ప్రకటనలను ఎంపిక చేసుకోవడం స్టార్ల వ్యక్తిగత విషయం. వారు కావాలనుకుంటే చేస్తారు.. వద్దు అంటే మానేస్తారు. అయితే ఆ ప్రకటన చేసేటప్పు అది హానికరమా.. ? లేదా అనేది కూడా చూసుకోవాలి. కొన్ని ప్రొడక్ట్స్ లో హానికరమైన పదార్దాలు ఉండొచ్చు..? లేకపోవచ్చు. కానీ.. దీనికన్నా ఎన్నో హానికరమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని నా నోటితో చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే వాటిని చెప్పి మళ్లీ వాటి ప్రమోషన్స్ నేను చేయలేను. అస్సలు ప్రకటనలు నా దృష్టిలో పెద్ద విషయమే కాదు.. ఒకవేళ హానికరమైన ప్రొడక్ట్స్ అయితే వినియోగదారులు ఎందుకు విక్రయిస్తున్నారు.. ప్రజలకు ఎందుకు అమ్మాలి. హానికరమైన ఉత్పతులను ఎందుకు అమ్ముతున్నారు..? అది వారిని అడగాల్సిన ప్రశ్న” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అజయ్ దేవగన్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అజయ్ వ్యాఖ్యలపై నెటిజన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు