బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే టాలీవుడ్ లో కీలక పాత్రలు పోషిస్తూ ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో అజయ్ కనిపించి మెప్పించాడు. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం రన్ వే 34. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాకు అజయే దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ హీరో తన చిన్నతనం లో తాను చేసిన తప్పులను నిర్మొహమాటంగా ఒప్పుకున్నాడు. స్టార్ హీరోగా ఆ తప్పులు చేస్తే తన పాపులారిటీ పోయేదాన్ని .. కానీ ఆ సమయంలో నేనొక యాక్షన్ డైరెక్టర్ కొడుకును మాత్రమే అని చెప్పుకొచ్చాడు.
” ఈ విషయాలను ఇప్పుడు చెప్పకూడదు. కానీ అంతకుముందే ఈ విషయాల గురించి చెప్పేశాను. చిన్నతనంలో ప్రతి ఒక్కరు చాలా తప్పులు చేస్తారు. కానీ , నేను వాటికన్నా ఎక్కువ చేసి జైలుకు కూడా వెళ్ళాను. ఒకసారి కాదు రెండు సార్లు వెళ్ళాను.. ఒకసారి మా నాన్న గన్ ను దొంగిలించడం వలన జైలుకు వెళ్ళాను.. రెండో సారి ఇంకోతప్పు చేయడం వలన వెళ్లాల్సివచ్చింది. నేటి తరం వారికి ఇలాంటివి తెలియవు.. ఆ ఏజ్ లో మేము చాలా ఎంజాయ్ చేశాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.