Aishwarya Rajesh: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి తెలుగు హీరోయినే అయినా కోలీవుడ్ లోనే ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెతను రచ్చ గెలిచి ఇంట గెలవాలి అనేలా మార్చింది. కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఉన్నా కూడా తెలుగులో అమ్మడికి అవకాశాలు లేకుండా పోయాయి. అడపాదడపా తెలుగులో కనిపించినా కూడా ఐశ్వర్య కి స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఈ మధ్యనే ఫర్హానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐశ్వర్య ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగాతెలుగులో సినిమాలు ఎందుకు చేయట్లేదు అనే విషయాన్ని చెప్పుకొచ్చింది.సరైన అవకాశాలు లేకపోవడంతోనే తన కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్నానని తెలిపింది.
Citadel: సిటాడెల్ కోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు.. అమెజాన్ సీఈవో ఏమన్నాడంటే.. ?
ఇక నేడు చెన్నైలోని ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఐశ్వర్య ఎక్కువగా లేడీ ఓరియంట్ సినిమాలు చేయడానికి గల కారణం చెప్పింది. చాలా మంది స్టార్ హీరోలు తనకు అవకాశాలు ఇవ్వలేదని అందుకే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నట్లు తెలిపింది.” కాకా ముట్టై సినిమా తర్వాత నాకు చాలా గ్యాప్ వచ్చింది. ఆ సినిమా చేసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం నన్ను పిలిచి మెచ్చుకుంది. ఒక్కసారిగా నా చుట్టూ అంతా బాగా జరుగుతుంది అనుకునే లోపు ఇలాంటి ఆఫర్లు రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దాదాపు రెండేళ్లు నాకు ఎలాంటి అవకాశాలు రాలేదు. ఇక నా కెరీర్ చూసుకుంటే అందులో ధనుష్, విజయ సేతుపతి, శివ కార్తికేయన్, దుల్కర్ సల్మాన్ లాంటివారు తప్ప మిగతా స్టార్ హీరోలు వారి సినిమాల్లో అవకాశాలు ఇవ్వలేదు. ఇక్కడ సమస్య ఏంటంటే హీరో, హీరోయిన్ కి మధ్య ఒక నిష్పత్తి ఉంది. మార్కెట్ విలువ, డిజిటల్ విలువ, ఓటీటి, శాటిలైట్ ఇలా అన్నీ చూసుకొని హీరోయిన్ తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో అక్కడ అన్నిట్లోనూ ఆశించిన స్థాయిలో ఉండాలంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే నేను మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించాలనుకున్నాను. ఇప్పటివరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు దాదాపు 15 వరకు చేశాను. కానీ, ఈరోజు కూడా ఏ స్టార్ హీరో నాకు అవకాశం ఇవ్వలేదు. అసలు ఎందుకు పిలవట్లేదు కూడా తెలియదు. కానీ, నా సినిమాకు నేనే హీరోగా చేస్తా అని డిసైడ్ అయ్యాను. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. పెద్ద హీరోలతో స్టార్ హీరోలతో అవకాశాలు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. నాకంటూ సొంత అభిమానులు ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.