Aha Naa Pellanta: రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ వెబ్ సీరిస్ ‘అహ నా పెళ్ళంట’. ఈ నెల 17 నుంచి ఇది జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్‌గా విడుదలైన ఈ వెబ్ సిరీస్ అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ, 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్‌ను రీచ్ కావడం విశేషం. అంతే కాకుండా ఐఎండీబీ ప్రకటించిన టాప్ టెన్ ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ లిస్టులోనూ ‘అహ నా పెళ్ళంట’ చోటు దక్కించుకుంది. తెలుగులో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనింగ్ సిరీస్‌ను అన్నీ భాషల్లో ప్రమోట్ చేశారు. కంటెంట్ చాలా బావుందని అన్నీ చోట్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
దీనికి లభిస్తున్న ఆదరణ గురించి దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, ”ఈ సక్సెస్ కు ప్రధాన కారణం కథ. తాను ప్రేమించిన అమ్మాయి పెళ్ళి పీటల మీద నుండి వెళ్ళిపోవడంతో డిస్ట్రబ్ అయిన ఓ యువకుడు అందుకు కారణమైన వ్యక్తులపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. చిత్రంగా తాను ప్రేమించిన అమ్మాయి లేచిపోవడానికి సహకరించిన అమ్మాయితోనే తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోయి, సాయం చేస్తాడు. వీరిద్దరి మధ్య ప్రేమ బంధం బలపడి, ఎలా పెళ్ళి పీటలెక్కరన్నదే ఈ వెబ్ సీరిస్ కథ. సినీ విమర్శకులు సైతం మా వెబ్ సిరీస్ బావుందని అప్రిషియేట్ చేశారు. అలాగే ఆడియెన్స్ కూడా అభినందిస్తున్నారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ శివానీ రాజశేఖర్ మధ్య కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ అని అందరూ అంటున్నారు. క్లీన్ కామెడీ, రొమాన్స్ అన్నీ చక్కగా కుదరడంతో కుటుంబం అంతా కలిసి దీనిని చూస్తున్నారు. ఇప్పటికీ చూడవారు ఎంచక్కా ఈ వీకెండ్ లో దీని చూసి ఎంజాయ్ చేయవచ్చు” అని అన్నారు.