నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా అఖండ విజయాన్ని నమోదు చేసుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఏ థియేటర్ వద్ద చూసినా జై బాలయ్య అరుపులు మారుమ్రోగిపోతున్నాయి. బోయపాటి – బాలయ్య కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా చూడడానికి నిజమైన అఘోరాలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో ఇద్దరు అఘోరాలు సందడి చేశారు. ప్రేక్షకుల నడుమ వారు సినిమాను చూసి ఆనందించారు. అనంతరం థియేటర్ బయట కొద్దిసేపు కూర్చున్నారు. సినిమా చాలా బావుందని, బాలకృష్ణ అఘోరాగా చాలా బాగా నటించాడని చెప్పారు. ఇక దీంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యి వారితో జై బాలయ్య అనిపించారు.. అనంతరం వారు శివ నామస్మరణ చేసుకుంటూ వెళ్లిపోయారు. అఘోరాలే వచ్చి బాలయ్య సినిమా చూడడంతో బాలయ్య ఫ్యాన్స్ రెచ్చిపోయారు.. ఇది బాలయ్య రేంజ్ అంటే.. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
