నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా అఖండ విజయాన్ని నమోదు చేసుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఏ థియేటర్ వద్ద చూసినా జై బాలయ్య అరుపులు మారుమ్రోగిపోతున్నాయి. బోయపాటి – బాలయ్య కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా చూడడానికి నిజమైన అఘోరాలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో ఇద్దరు అఘోరాలు సందడి…