Varun Tej:మెగా ఫ్యామిలోకి మరో కొత్త కోడలు ఎంటర్ అయ్యింది. మెగా బ్రదర్ ఇంట కొత్త కోడలు అడుగుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇదే హాట్ టాపిక్. హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొద్దిసేపటి క్రితమే ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మెగా ఫామిలీ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యింది. సినిమాలు, స్టైల్ లోనే కాకుండా వరుణ్ .. పెళ్లి విషయంలో కూడా బాబాయ్ పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్నాడు అని చెప్పుకొస్తున్నారు అభిమానులు. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఎవ్వరు హీరోయిన్స్ ను వివాహమాడలేదు. చిరు భార్య సురేఖ, నాగబాబు భార్య పద్మ, అల్లు అరవింద్ భార్య గీత.. అల్లు అర్జున్ భార్య స్నేహ.. రామ్ చరణ్ భార్య ఉపాసన.. ఇలా అందరూ బిజినెస్ రంగంలోనో.. మరో రంగానికి చెందినవారు.
Lavanya Tripathi: మెగా కోడలు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మెంటల్ ఎక్కాల్సిందే..?
పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్ ను బద్రి సినిమా సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వరుణ్ సైతం మిస్టర్ సినిమా సమయంలో లావణ్యను ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు. మెగా ఇంట రేణు దేశాయ్ తరువాత హీరోయిన్ అయిన లావణ్యనే రెండోసారి అడుగుపెడుతుంది. దీంతో లావణ్య చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. నేడు ఎంగేజ్ మెంట్ సింపుల్ గా జరుపుకున్నా.. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరపనున్నారట మెగా ఫ్యామిలీ. ఏదిఏమైనా అబ్బాయ్.. బాబాయ్ ను అన్ని విషయాల్లో ఫాలో అవుతున్నాడు మంచిదే. ఒక్క విడాకుల విషయంలో మాత్రం ఫాలో కాకూడదు అని కోరుకుంటున్నాం అని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. వరుణ్- లావణ్య నిండు నూరేళ్లు కలిసి ఉండాలని కోరుకుందాం.