లావణ్య త్రిపాఠి.. మెగా కోడలిగా మెగా ఇంట అడుగుపెట్టబోతుంది

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ తో  లావణ్య ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే 

జూన్ 9 న వరుణ్- లావణ్య ఎంగేజ్ మెంట్ జరిగింది

ఇక దీంతో లావణ్య ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని మెగా ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారు

లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది

ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసి ఇంట్లోనే ఉంటుంది

లావణ్యకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు.. 

ముంబైకి వెళ్ళి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుంది లావణ్య 

మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ తో ఆమె సినీ రంగంలోకి ప్రవేశించిది లావణ్య 

 2006 లో లావణ్య మిస్ ఉత్తరాఖండ్ కిరీటంను గెలుచుకుంది 

2012 లో తెలుగులో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య 

మొదటిసినిమాతోనే అందరిని ఆకర్షించిన లావణ్య మంచి డీసెంట్ హిట్స్ అందుకుంది 

2017 లో వచ్చిన మిస్టర్ సినిమా ద్వారా వరుణ్ తేజ్ తో లావణ్యకు పరిచయం ఏర్పడింది 

అంతరిక్షం సినిమాతో వీరి పరిచయం ప్రేమకు దారితీసింది

లావణ్య వరుణ్ కు మాత్రమే కాదు ఆయన చెల్లి నిహారికకు జిమ్ మేట్ 

నిహారికకు కూడా ఫ్రెండ్ కావడంతోనే లావణ్య ఒక్కత్తే ఆమె పెళ్లి మొత్తంలో సందడి చేసింది 

వరుణ్- లావణ్యల ఐదేళ్ల ప్రేమ.. ఇప్పుడు పెళ్లిగా మారనుంది