నటసింహం నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేసి ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నెవర్ బిఫోర్ అనే రేంజులో కనిపించిన బాలయ్య, వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా కేవలం ఎనిమిది రోజుల్లో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అంటే ఈ మూవీని ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. నైజాం, సీడెడ్ ఏరియాల్లో బాలయ్య ర్యాంపేజ్ సెకండ్ వీక్ లో కొనసాగుతుంది. అఖండ లైఫ్ టైమ్ బిజినెస్ ని కేవలం మొదటివారంలోని బీట్ చేసిన వీర సింహా రెడ్డి సినిమాన్ని రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేసింది. బయ్యర్స్ అందరికీ ప్రాఫిట్స్ ఇస్తున్న వీర సింహా రెడ్డి సినిమా సక్సస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.
హరీష్ శంకర్, శివ నిర్వాణ, హను రాఘవపూడి, అనీల్ రావిపూడి, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ స్పెషల్ గెస్టులుగా వచ్చిన ఈ సక్సస్ మీట్ ఫుల్ జోష్ లో సాగింది. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ సక్సస్ మీట్ అయ్యాకా బాలయ్య అండ్ టీమ్ పార్టీ చేసుకున్నారు. హానీ రోజ్, బాలయ్యల ఫోటో ఒకటి ఈ సక్సస్ పార్టీ నుంచి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ఫుల్ ఆన్ లో ఉన్నాడు, ఇది NBK సీజన్ అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంక్రాంతి సీజన్ అయిపొయింది కాబట్టి వీర సింహా రెడ్డి సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కానీ సీడెడ్ ఏరియాలో మాత్రం మరికొన్ని రోజుల పాటు బాలయ్య హవా కొనసాగనుంది.