జగన్ భరోసా ఇచ్చారు.. నమ్మకంగా చెప్తున్నా- చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానం మేరకు అమరావతి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ భేటీ ముగిసింది. సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై గంటన్నర పాటు మెగాస్టార్ చిరంజీవి కి, సీఎం జగన్ కు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినాట్లు తెలుస్తోంది. ఇక భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ” జగన్ గారితో తో సమావేశం చాలా సంతృప్తిగా జరిగింది. సంక్రాంతి పండగ పూట ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉంది. ఆయన నాతో మాట్లాడిన తీరు నాకు సంతృప్తినిచ్చింది. ఇక గత కొన్ని నెలలుగా నడుస్తున్న విషయంపై ఎంతో మీమాంస ఏర్పడింది. జటిలమైన ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడానికి జగన్ గారు నన్నుఆహ్వానించారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక సైడ్ మాత్రమే కాదు రెండు సైడ్లు వినాలని, మీరు వస్తే ఒక విధివిదానాన్ని తయారుచేసి .. తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన నన్ను కోరడం ఎంతో భాద్యతగా అనిపించింది.
సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నా. సీఎం ప్రయత్నానికి అభినందనలు. ఇక అంతేకాకుండా థియేటర్ల వాళ్ళు పడుతున్న సాదరాబాధకాలు అన్ని తెలుపడం జరిగింది. ఆయన వెంటనే సానుకూలంగాస్పందించి ఉభయతర ఆమోదయోగ్యంగా నిర్ణయానికి వచ్చి .. కమిటీకి చెప్తాము.. కమిటీ తుది నిర్ణయానికి వస్తాము అని చెప్పారు.. ఈ మాటలతో జగన్ గారిపై నాకు భరోసా వచ్చింది. నేను నమ్మకంగా చెప్తున్నా ఆయన మాటలు ఒక ధైర్యాన్ని ఇచ్చాయి. ఏదో మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి ఉంది. నేను ఒక పక్షాన ఉండను, అందరినీ సమదృష్టితో చూస్తానని, భయపడొద్దని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఒక మంచి నిర్ణయంతో వస్తామని చెప్పారు. అందరికి ఆమోద యోగ్యం అయితే దాన్ని జీవో గా తీసుకొందామని చెప్పారు. అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానన్నారు.ఈ వారం పదిరోజుల్లో లేదా నెలలో కొత్త జీవో వస్తుంది.చిన్న సినిమాలపై కూడా ఆలోచించి ఐదో ఆటకు అనుమతి ఇస్తానన్నారు అని చెప్పుకొచ్చారు.
Also Read
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
తాజావార్తలు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!