‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకున్న బ్యూటీ అదితి రావు హైదరీ. ఈ బాలీవుడ్ బ్యూటీకి టాలీవుడ్ లోనే మంచి గుర్తింపు లభించింది. ఇక్కడ క్రేజ్ వచ్చాక బాలీవుడ్ పరిశ్రమ దృష్టి అదితి రావు హైదరీపై పడింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘పద్మావత్’ సినిమాలో క్వీన్ మెహరునిసా పాత్ర అదితి రావు హైదరికి మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 14న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రబృందం. దీనికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.
Read Also : బిగ్ షాక్… శ్రియకు పాప పుట్టిందా!?
ప్రచార కార్యక్రమాల సమయంలో అదితి రావు హైదరి తాను సగం తెలుగు అమ్మాయి అని, మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని వెల్లడించింది. ఇదిలా ఉండాలా అదితి రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు హిట్ టాపిక్ గా మారింది. సన్నిహిత వర్గాలు సమాచారం మేరకు ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో నటించడానికి 1 కోటి రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.