Adipurush writer Manoj Muntashir says ‘Hanuman is not God’: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్ సినిమా విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంటోంది. ‘ఆదిపురుష్’.. రామాయణాన్ని అగౌరవ పరిచేలా ఉందని కొందరు విమర్శలు చేస్తున్న సమయంలో రామాయణం కాదని ఆ మహా గ్రంథం నుండి ప్రేరణ పొందింది మాత్రమేనని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చారు. ఇక మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హనుమంతుడు దేవుడు కాదంటూ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ముంతాషిర్ హనుమంతుడు ‘భగవాన్ నహీ భక్త్ హై’ అని చెబుతున్నారు. ఈ మాటలు హిందువులకు విపరీతమైన కోపం తెప్పిస్తున్నాయి.
Raviteja: ఆ నిర్మాణ సంస్థతో రవితేజ 100 కోట్ల డీల్!
హనుమంతుడు దేవుడు కాదని పేర్కొన్న ముంతాషిర్ ఆయన దేవుడు కాదు, కేవలం భక్తుడు, మనం వారిని దేవుడిగా చేసుకున్నాం అని చెప్పొకొచ్చారు. సినిమాలో తాను రాసుకున్న డైలాగ్‌ను సమర్థిస్తూ, శ్రీరాముడిలా హనుమంతుడు కమ్యూనికేట్ చేయలేడని, రాముడిలా తాత్వికంగా మాట్లాడలేడు అని మనోజ్ ముంతాషిర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ముంతాషీర్ చేసిన ఈ కామెంట్లు అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. ‘ఆదిపురుష్’లో హనుమంతుని చేత లంకాదహనం ముందు పలికించిన డైలాగులా వల్ల మనోజ్ ముంతాషిర్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. సినిమాలోని డైలాగ్‌లను మారిస్తే బాగుండు అని ఆడియెన్స్ ఇస్తున్న సలహాలతో ఇటీవలే డైలాగులు మార్చేందుకు సినిమా యూనిట్ సిద్ధమైంది. మార్చబడిన డైలాగ్స్ తో మరో కొద్ది రోజుల్లో థియేటర్‌లలో ‘ఆదిపురుష్’ను చూడడానికి కూడా కొందరు సిద్ధం అవుతున్నారు.