పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ఆడియన్స్ ముందుకి రానుంది. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ కి గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేసారు. ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటివరకూ ఏ సినిమాకి జరగనంత గ్రాండ్ గా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చేయడానికి రెడీ అయ్యారు. జూన్ 6న తిరుపతి ఆదిపురుష్ ఈవెంట్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. 200 మంది సింగర్స్, 200 మంది డాన్సర్స్, స్పెషల్ బాణాసంచా, భారీ కటౌట్స్… ఇలా దాదాపు రెండు కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే తిరుపతిలో అయోధ్యని సెట్ వేసే రేంజులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ తో ఆదిపురుష్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారనుంది.
Read Also: Salaar: ప్రశాంత్ నీల్ బర్త్ డేకి ప్రభాస్ సెలబ్రేషన్స్…