Adhurs 2: వినాయక్ సంచలన వ్యాఖ్యలు .. చారిని మళ్ళీ చూడనట్టే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అదుర్స్ 2’ పై క్రియేటివ్ డైరెక్టర్ వి.వి. వినాయక్ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కల్ట్ క్లాసిక్ ‘అదుర్స్’ సీక్వెల్‌పై ఆయన పెదవి విరిచారు. రచయిత కోన వెంకట్ ఇటీవల ‘అదుర్స్ 2’ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని చేసిన వ్యాఖ్యలపై వినాయక్ స్పందిస్తూ, ఫ్యాన్స్‌కు కాస్త చేదు నిజం చెప్పారు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘అదుర్స్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ పోషించిన ‘చారి’ పాత్ర, బ్రహ్మానందంతో ఆయన కెమిస్ట్రీ ఇప్పటికీ మీమ్స్ రూపంలో మనల్ని నవ్విస్తూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, దర్శకుడు వినాయక్ క్లారిటీ ఇచ్చారు.
Also Read:Mohanlal New Movies: లాలట్టన్ లైనప్ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!
Also Read
- RAW NTR: ఊహించని ట్విస్ట్.. 'రా ఎన్టీఆర్'కు గుడ్‌బై.. అసలు ఏమైంది?
- Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్‌గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
- Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
- Jananayagan : విజయ్ 'జననాయకుడు' ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
“ఫ్రాంక్‌గా చెప్పాలంటే, ఆ కథ అక్కడితో ముగిసిపోయింది. మళ్ళీ అందులో కొత్తగా చూపించడానికి ఏముంది?” అని ఆయన ప్రశ్నించారు. కేవలం సీక్వెల్ తీయాలి కదా అని బలవంతంగా తీస్తే, మొదటి భాగం అందించిన గొప్ప అనుభూతిని మళ్ళీ తీసుకురాలేమని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని సినిమాలు హిట్టైనప్పుడు వాటిని ఒక మధుర జ్ఞాపకంగా వదిలేయడమే మంచిదని వినాయక్ మాటల సారాంశం. “మళ్ళీ అంత గొప్పగా తీయగలమన్న నమ్మకం నాకే లేదు.. అందుకే దాని జోలికి వెళ్లకుండా ఉండటమే బెటర్” అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీనితో ‘అదుర్స్ 2’ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే అయినా, ఒక కల్ట్ సినిమా పరువు తీయకూడదనే వినాయక్ నిర్ణయాన్ని విశ్లేషకులు స్వాగతిస్తున్నారు.
తాజావార్తలు
-
Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్‌బై.. అసలు ఏమైంది?
-
Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!