Mohanlal New Movies: లాలట్టన్ లైనప్ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!
- లాస్ట్ ఇయర్ మోహన్ లాల్ చూపించిన హవా అంతా ఇంతా కాదు
- 2025 మోహన్ లాల్ నామ సంవ్సతరం అనొచ్చు
- 2026లో లాలట్టన్ లైనప్ మాములుగా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohanlal Upcoming Movies in 2026: లాస్ట్ ఇయర్ మోహన్ లాల్ చూపించిన హవా అంతా ఇంతా కాదు. ‘ఎల్2 ఎంపురన్’, ‘తుడరుమ్’, ‘హృదయ పూర్వం’తో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను టేస్ట్ చేశారు. కానీ ‘వృషభ’ టోటల్ హ్యాపీనెస్‌ను స్మాష్ చేసేసింది. వృషభ ఆల్ట్రా డిజాస్టరైనా.. లాలట్టన్ లైనప్‌కు వచ్చిన ఢోకా లేదు. ఇంకా చెప్పాలంటే.. మరింత బిజీగా మారుతున్నారు.
2025 మోహన్ లాల్ నామ సంవ్సతరం అనొచ్చు. ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. ఎల్2 ఎంపురన్, తుడరుమ్ ఆయన కెరీర్‌లోనే కాదు.. మాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచాయి. లోక రానంత వరకు ఎంపురన్ హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్. హృదయ పూర్వం కూడా వంద కోట్ల క్లబ్‌లోకి చేరడంతో లాలట్టన్ ఆనందానికి అవధుల్లేవ్. మాలీవుడ్ చిత్రాలు కంప్లీట్ స్టార్ గ్రాఫ్ అమాంతం పెరిగితే.. భారీ బడ్జెట్ చిత్రాలు కన్నప్ప, వృషభ హ్యాట్రిక్ హిట్ కొట్టానన్న హ్యాపీనెస్ కూల్చేశాయి. కన్నప్పలో క్యామియో కాబట్టి లైట్ తీసుకున్నా.. వృషభ మాత్రం గట్టి దెబ్బే వేసింది. మరోసారి లాలట్టన్‌కు భారీ చిత్రాలు కలిసి రావన్న ముద్ర పడింది.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Kamal : సిద్ధా' డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
- Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
బొమ్మ డిజాస్టరైనా మోహన్ లాల్ ఆఫర్స్‌కు వచ్చిన ఢోకాలేదు. జీతూ జోసెఫ్‌తో దృశ్యం-3 తో పాటు తన దోస్త్ మమ్ముట్టితో కలిసి పేట్రియాట్ మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇవే కాదు ఆయన లైనప్ చూస్తే మాలీవుడ్ యంగ్ హీరోలు కూడా సాటిరారు. సీనియర్ అండ్ యంగ్ డైనమిక్ దర్శకులతో కొలబరేట్ అవుతూ.. టూ జనరేషన్స్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు మోహన్ లాల్. తుడరుమ్‌తో తనకు మాసివ్ హిట్టిచ్చిన తరుణ్ మూర్తితో ఎల్366 చేస్తున్న లాలట్టన్.. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ 100వ సినిమాకు ఓకే చెప్పారు.
Also Read: Anushka Sharma-Tollywood: అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ.. కట్ చేస్తే.. !
మోహన్ లాల్ మూవీతో దర్శకుడిగా ఇంట్రడ్యూసైన ప్రియదర్శన్.. మళ్లీ ఆయనతోనే వందో సినిమా చేయనున్నాడు. మరక్కార్‌తో భారీ డిజాస్టర్ ఇచ్చిన ప్రియదర్శన్‌ను నమ్మి మరో ఛాన్స్ ఇచ్చారు లాలట్టన్. తన కూతురు విస్మయను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేస్తోన్న తుడక్కుమ్‌లోనూ కీ రోల్ చేస్తున్నారు కంప్లీట్ స్టార్. హృదయ పూర్వం దర్శకుడు సత్యన్ అంతికాడుకు తనను డీల్ చేసే గోల్డెన్ ఆఫర్చునిటీ అందించారు మోహన్ లాల్. మహీషంటే ప్రతీకారమ్, జోజు చిత్రాలతో పాపులరైన దిలీష్ పోతన్, విష్ణు మోహన్ అనే యంగ్ దర్శకులకు తన లైనప్‌లో ప్లేస్ ఇచ్చారు. అలాగే లాలట్టన్‌తో సినిమాలు చేయకపోతే నిద్ర పట్టని జీతూ జోసెఫ్ మరోసారి టయ్యప్ అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ నిర్మిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!