‘జాంబిరెడ్డి’తో సోలో హీరోగా చక్కని విజయాన్ని అందుకున్నాడు తేజ సజ్జా. ప్రస్తుతం తేజ కథానాయకుడిగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ‘అద్భుతం’ చిత్రాన్ని చంద్రశేఖర్ మొగుళ్ళ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివాని రాజశేఖర్ ఇప్పటికే పలు క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఆమె నటించిన చిత్రాలలో మొదట విడుదలవుతున్న సినిమా ‘అద్భుతం’. ఈ సినిమాకు ‘జాంబిరెడ్డి’ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించడం మరో విశేషం. సో… ప్రశాంత్ వర్మ కథ, మల్లిక్ రామ్ దర్శకత్వ ప్రతిభ, తేజ సజ్జ యాక్షన్, శివాని రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్యూటీ వెరసి ‘అద్భుతం’ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు నిర్మాత చంద్రశేఖర్. సత్య, మిర్చి కిరణ్, తులసి, శివాజీరాజా తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు రాథన్ సంగీతం అందించాడు. ఈ నెల 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘అద్భుతం’ స్ట్రీమింగ్ కాబోతోంది.
Read Also : 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పునీత్… ఎవరి కోసమంటే !!