Actress Sudha Crucial Comments on Meera Death: విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా అంటోని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న ఆమె ఈ తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. ఆమెను హుటాహుటిన హాస్పిటల్ కి తరలించినా హాస్పిటల్ కి చేరుకునే లోపే కన్నుమూసినట్లుగా వైద్యులు ప్రకటించారు. అయితే ఈ విషయం తెలిసినప్పటి నుంచి తమిళ సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయినట్లు అయింది. విజయ్ ఆంటోనీ కన్నీటిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. అయితే మీరా ఆంటోనీ మృతి గురించి సీనియర్ నటి సుధ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి సుధా తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాల్లో కూడా పెద్ద ఎత్తున నటిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె విజయ్ ఆంటోనీ తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటల వరకు షూటింగ్ జరిగిందని ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లామని ఆమె అన్నారు.
3 Ekka: 20 రోజుల్లో 25 కోట్లు.. రికార్డులు బద్దలు కొడుతున్న గుజరాతీ సినిమా
ఇక ఈరోజు ఉదయం విషయం తెలిసిన వెంటనే విజయ్ ఆంటోనీ తల్లికి ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేశానని అన్నారు. చనిపోయిన పాపకు చీకట్లో ఉండాలన్న, ఒంటరిగా ఉండాలన్నా కూడా భయమేనని అయితే అలాంటి అమ్మాయి ఈ అఘాయిత్యానికి ఎందుకు పాల్పడిందనే విషయం తెలియడం లేదని అన్నారు. ఒకరకంగా విజయ్ ఆంటోనీ కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్ కి గురై ఎంతో వేదన అనుభవించి పునర్జన్మ పొంది మళ్ళీ తిరిగి వచ్చారని బహుశా అతను ఎంత కష్టం వరకు తట్టుకోగలడు అని దేవుడు పరీక్షిస్తున్నట్లుగా తనకి అనిపిస్తోందని అని ఆమె చెప్పుకొచ్చారు. సుమారు పది రోజుల నుంచి కలిసి షూటింగ్ చేస్తున్నామని, ఈ రోజుల్లో విజయ్ ఆంటోనీ లాంటి వ్యక్తులు ఉండడం చాలా అరుదని చెప్పుకొచ్చారు ఎంతసేపు భార్య గురించి పిల్లల గురించే షూటింగ్లో కూడా చెబుతూ ఉండేవాడని ఇలా జరుగుతుందని ఆయన కూడా కలలో కూడా ఊహించి ఉండడని సుధ చెప్పుకొచ్చింది.