యాక్షన్ హీరో విశాల్ నటించిన పొగరు సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ ప్లే చేసింది ‘శ్రీయ రెడ్డి’. రమ్యకృష్ణ తర్వాత నెగటివ్ లీడ్ యాక్టర్ గా ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న శ్రీయా రెడ్డి గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంది. అప్పుడప్పుడూ ఒక సినిమా చేస్తూ వస్తున్న శ్రీయా రెడ్డి, లేటెస్ట్ గా స్పీడ్ పెంచుతూ ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామా ‘సలార్’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా ‘OG’ సినిమాల్లో శ్రీయ రెడ్డి యాక్ట్ చేస్తోంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి ఇవి హిట్ అయితే శ్రీయ రెడ్డి కెరీర్ టర్న్ అయిపోయినట్లే.
ఇక లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో శ్రీయ రెడ్డి ఫోటో పోస్ట్ చేస్తూ “మొమెంట్ ఆఫ్ సైలెన్స్ క్యాప్చర్డ్” అంటూ కోట్ చేసింది. పెద్ద బొట్టు, ఫేస్ పైన హాఫ్ లైట్ తో శ్రీయ రెడ్డి ఈ ఫొటోలో పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఎదో ఆలోచిస్తున్నట్లు ఉన్న ఈ ఫోటో ఇంతకీ ఏ సినిమాకి సంబంధించినది. సలార్ సినిమానా లేక OG సినిమా షూటింగ్ నుంచి బయటకి వచ్చిందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే సలార్ సినిమా గురించి ఇటీవలే స్పందించిన శ్రీయ రెడ్డి, “సలార్ సినిమా ఇండియా గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజులో” ఉంటుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ దెబ్బకి సలార్ టాగ్ ట్విట్టర్ లో రెండు రోజుల పాటు నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/sriyareddy/status/1687014515043717120