ఈ మధ్యే కరీనా కపూర్ ఓ సినిమాలో నటించేందుకు 12 కోట్లు డిమాండ్ చేసింది! మరో సినిమాలో భర్త రణవీర్ తో రొమాన్స్ చేసేందుకు దీపికా ఒప్పుకోలేదట! కారణం, ఆమె అడిగినంత ఫీజు నిర్మాతలు ఇవ్వకపోవటమే! బాలీవుడ్ లో డబ్బు కారణంగా సినిమాల్ని బ్యూటీస్ రిజెక్ట్ చేయటం కొత్తేం కాదు. పైగా బీ-టౌన్ ముద్దుగుమ్మలు రోజురోజుకి రేటు పెంచేస్తున్నారు కూడా! కానీ, సోనమ్ కపూర్ కేవలం 11 రూపాయలు తీసుకుని ఓ చక్కటి సినిమా చేసింది…
‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో సోనమ్ కపూర్ కనిపిస్తుంది. కానీ, కథతో ఆమెకు పెద్దగా సంబంధం ఉండదు. మిల్కా సింగ్ గా నటించిన ఫర్హాన్ అఖ్తర్ లవ్ ఇంట్రస్ట్ ఆమె. అయితే, తన పాత్రకి అంతగా ప్రాముఖ్యత లేకున్నా సోనమ్ ఎందుకని నటించింది? డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాతో ఉన్న అనుబంధమే కారణమట!
రాకేశ్ మెహ్రా ఈ మధ్య ఆత్మకథ రాశాడు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది కూడా సోనమ్ కపూరే. ఆమెతో ‘రంగ్ దే బసంతి’ మూవీ డైరెక్టర్ కి చాలా అనుబంధం ఉంది. ‘దిల్లీ 6’ చిత్రీకరణ సమయంలో సోనమ్, రాకేశ్ మంచి మిత్రులయ్యారు. ఆ చొరవతోనే ‘భాగ్ మిల్కా భాగ్’లో నటించమని అడిగాడట. కేవలం 7 రోజులు డేట్స్ కేటాయిస్తే చాలని అన్నాడట. సోనమ్ కి కూడా ‘భాగ్ మిల్కా భాగ్’ స్టోరీ నచ్చటంతో సినిమాలో భాగం కావాలని అనుకుందట. ఆలస్యం చేయకుండానే పదకొండు రూపాయల దక్షిణ పుచ్చుకుని సినిమాకు సై అనేసింది. కట్ చేస్తే… మూవీ రిలీజ్ తరువాత ఆమె పాత్ర సీరియస్ గా సాగే స్టోరీకి ఎంతో పెద్ద రిలీఫ్ గా మారిందట!
డైరెక్టర్ తో ఉన్న అనుబంధం కోసం చిన్న పాత్ర చేయటమే గొప్ప… అందులోనూ అనీల్ కపూర్ కూతురైన సోనమ్.. కేవలం పదకొండు రూపాయలు తీసుకుని ఏడు రోజులు కష్టపడటం.. మరింత అభినందనీయం!