మాలీవుడ్ బ్యూటీ సానియా అయ్యప్పన్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ ఫోటోషూట్లతో అమ్మడు మంటలు రేపుతూ ఉంటుంది. ఇక ‘క్వీన్’, ‘లూసిఫర్’, ‘ద ఫ్రీస్ట్’ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మక చాలాసార్లు ట్రోలింగ్ కి కూడా గురైంది. తాజాగా మరోసారి ఒక ఆకతాయి చేసిన కామెంట్ ని ధీటైన బదులు చెప్పి అతగాడి నోరు మూయించింది. తాజాగా సానియా ఓపెన్ షవర్ కింద బికినీతో స్నానం చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా బాలీవుడ్ మూవీ ‘గెహ్రాయియా’లోని ఓ పాటకు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది.
ఇక ఈ వీడియో చూసిన చాలామంది సూపర్.. నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెట్టగా.. ఒక నెటిజన్ మాత్రం “ఛీఛీ సిగ్గులేదా.. ఇలా స్నానం చేసే వీడియోలను పోస్ట్ చేస్తున్నావ్.. ఇలా చేస్తే ఈవ్ టీజింగ్ కేసులు ఏవిధంగా తగ్గుతాయి’’ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కి నొచ్చుకోకుండా ఈ హాట్ బ్యూటీ ఘాటుగా సమాధానం చెప్పింది. ” అస్సలు సిగ్గంటే ఏంటీ” అని బదులు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న నెటిజన్లు రెండు పార్టీలుగా విడిపోయి చర్చ మొదలుపెట్టారు. కొంతమంది సానియాకు మాట్టాడు పలుకుతూనే ఇంకొంతమంది ఆమెను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.