Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుని ఆడింది. కానీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ఈ సినిమాపై కొందరు పెదవి వరుస్తున్నారు. తాజాగా రెబా మౌనిక తన అసంతృప్తిని బయట పెట్టింది. ఇన్ స్టాలో ఫ్యాన్స్ తోచిట్ చాట్ చేస్తూ.. కూలీ సినిమాపై స్పందించింది. కూలీ సినిమాలో నేను అనుకున్న పాత్ర ఇవ్వలేదు. కొన్ని సార్లు మనం అనుకున్నవి జరగవు. దానికి నిరుత్సాహ పడొద్దు అంటూ కామెంట్ చేసింది. ఇంకేముంది దీనిపై రచ్చ జరుగుతోంది. ఎందుకంటే ఇదే రెబా మౌనిక సినిమా రిలీజ్ కు ముందు చేసిన వీడియోలను తాజాగా ఫ్యాన్స్ బయట పెడుతున్నారు. అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ ఏకిపారేస్తున్నారు.
Read Also : Tamannaah : అల్లు అర్జున్ వల్లే ఇన్ని కోట్లు సంపాదించా
ఈ సినిమా రిలీజ్ కు మందు ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను పాత్ర ఇవ్వమని అడిగాను. ఇది నాకు చాలా స్పెషల్. రజినీకాంత్ గారితో నటించడం కోసమే ఈ పాత్ర అడిగాను. నాకు లోకేష్ మంచి పాత్ర ఇచ్చారు అంటూ తెలిపింది. కూలీ సినిమాలో శృతిహాసన్ ఇద్దరు చెల్లెళ్లలో ఒక సిస్టర్ పాత్రలో రెబా మౌనిక నటించింది. అయితే అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా మాట్లాడుతావా అంటూ ఆమెను ఏకి పారేస్తున్నారు నెటిజన్లు. ఇలా మాట మార్చడం ఎందుకు.. నీకు అవసరం ఉన్నప్పుడు ఒకలా.. అవసరం లేనప్పుడు మరోలా మాట్లాడుతావా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
Read Also : Katrina Kaif : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
