Pragathi: టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ సపోర్టివ్ రోల్స్ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోంది. ఇక సినిమా వేరు, రియాలిటీలో తన జీవితం వేరని, తనకు నచ్చినట్లు జీవిస్తోంది. నిత్యం జిమ్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగతి ప్రస్తుతం ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా తనకు గుర్తింపు తెచ్చేది, పాత్రకు ప్రాధాన్యత ఉన్నది మాత్రమే చేస్తోంది. ఇక ప్రగతి వ్యక్తిగత విషయాలకొస్తే.. ఆమె సింగిల్ మదర్.. ఒక కొడుకు, ఒక కూతురుతో కలిసి ఉంటుంది. భర్త నుంచి ఎప్పుడో దూరమైన ఆమె అతని నుంచి విడిపోవడం బాధగా అనిపించలేదని, తాను తీసుకున్న నిర్ణయాలు చాలావరకు మంచికే అని నమ్ముతున్నట్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా మరో ఇంటర్వ్యూలో ఆమె తన రెండో పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. ప్రస్తుతం మీరు ఒంటరిగా ఉంటున్నారు.. మీకెప్పుడైనా రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందా..? అన్న ప్రశ్నకు ప్రగతి మాట్లాడుతూ.. ” నేను పెళ్లి అనే పదం కన్నా ఎక్కువ కంప్యానియన్ ను నమ్ముతాను. మనకు ఎప్పుడు తోడుగా ఉండే వ్యక్తి కావాలని కోరుకోవడం తప్పులేదు. నాకు చాలాసార్లు ఆ తోడు కావాలనిపించింది. కానీ, నా మెచ్యూరిటీ లెవెల్ కు మ్యాచ్ అవుతాడా..? అలాంటి వాడు దొరుకుతాడా..? అని అనిపిస్తూ ఉంటుంది. నా వరకు వస్తే.. కొన్ని విషయాల్లో నేను చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఒకవేళ నేను 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అలా కాంప్రమైజ్ అయ్యేదాన్నేమో.. ఇప్పుడు అలా లేను. అడ్జెస్ట్ అవ్వడం చాలా కష్టం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రగతి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.