ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేకపోయినా, జీపీఎస్ లేకపోయినా బతకడం కష్టం
స్మార్ట్ ఫోన్ లో ఉండే జీపీఎస్ లో ఒక అమ్మాయి గొంతు వినిపిస్తూ ఉంటుంది తెలుసుగా
గో లెఫ్ట్, రీచ్డ్ డెస్టినేషన్ అంటూ మధురమైన వాయిస్ మనకు వినిపిస్తూ ఉంటుంది
ఆ జీపీఎస్ గొంతు మరి ఎవరిదో కాదు కారెన్ జకాబ్సన్ దే
కారెన్ ఆస్ట్రేలియాలోని మాకే నగరంలో నివసిస్తోంది
కారెన్ వాయిస్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు సింగర్, రచయిత్రి కూడా
2002 లో ఆమెకు జీపీఎస్ వాయిస్ ఆర్టిస్ట్ గా ఉద్యోగం వచ్చింది
ఈ జీపీఎస్ సిస్టమ్ కోసం ఆమె 50 గంటలు తన వాయిస్ ను రికార్డ్ చేసింది
ప్రస్తుతం ఏ స్మార్ట్ ఫోన్ లోనైనా కారెన్ గొంతే వినిపిస్తుంది
కారెన్ గొంతు ఒక్క జీపీఎస్ లో మాత్రమే కాదు ఎలివేటర్లు, సినిమా థియేటర్స్, ఆడియో బుక్స్, సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ లో కూడా వినిపిస్తుంది.
ఆస్ట్రేలియాలో ఐఫోన్ లో వచ్చే సిరి వాయిస్ కారెన్ దే