యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్పై’పై భారీ అంచనాలు ఉన్నాయి. నేతాజీ మిస్సింగ్ మిస్టరీపై రూపొందిన సినిమాగా స్పై ప్రమోట్ అవుతుండడంతో బజ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతోంది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది కోలీవుడ్ హీరోయిన్ ‘ఐశ్వర్య మీనన్’. 2012 నుంచి కోలీవుడ్ లో హీరోయిన్ గా ఉన్న ఐశ్వర్య మీనన్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మేనట్లు ఎక్కిపోవడం గ్యారెంటీ. పట్టుమని పది సినిమాలే చేసినా ట్విట్టర్ లో ఐశ్వర్య మీనన్ కి దాదాపు ఏడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఆమె పోస్ట్ చేసే ఫొటోస్ కి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అవర్ గ్లాస్ షేప్ ని పర్ఫెక్ట్ గా మైంటైన్ చేసే ఐశ్వర్య మీనన్ ఇప్పటికే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించేసింది.
ఇక ఇప్పుడు స్పై సినిమాతో టాలీవుడ్ లోకి కూడా వచ్చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు ఎలా పెట్టాలి? చీరలో కూడా హాట్ గా ఎలా కనిపించాలి? యూత్ ని తన ఫొటోస్ నుంచి కళ్లని పక్కకి తిప్పుకోనివ్వకుండా ఏం చేయాలి? అనే విషయాలు ఐశ్వర్య మీనన్ కి తెలిసినంతగా ఇంకో హీరోయిన్ తెలియదేమో. పింక్ టాప్ లో ఐశ్వర్య మీనన్ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ చూస్తే సింపుల్ గా ఉన్నా అట్రాక్ట్ చేసేలా ఉందని ఎవరైనా ఫీల్ అవ్వాల్సిందే. ఇప్పటివరకూ తన ఫొటోస్ తో మాత్రమే తెలుగు యూత్ ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ, స్పై సినిమా రిలీజ్ అయితే తన అందంతో కూడా ఇంప్రెస్ చేయడం గ్యారెంటీ.
Can’t say no to PINK ever 💖 pic.twitter.com/VoH6dsdKn1
— ISWARYA MENON 🌸 (@Ishmenon) June 6, 2023