Hema : స్టార్ యాక్టర్ హేమ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారనే కారణంతో కరాటే కళ్యాణికి నోటీసులు పంపించారు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తనపై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించింది. ఇందులో భాగంగా కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి యూట్యూబ్ ఛానెల్స్ తో పాటు మరికొన్ని ఛానెల్స్ కు లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించింది. వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆమె లాయర్లు తెలిపారు.
Read Also : Wife torture: భార్య వేధింపులకు మరో వ్యక్తి బలి.. రైలు కింద పడి సూసైడ్..
కాగా గతేడాది ఆమె బెంగుళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుందనే కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ టైమ్ లో ఆమెపై చాలా మంది వీడియోలు చేశారు. అప్పుడు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. రిపోర్టుల్లో నెగెటివ్ రావడంతో ఆమెకు ఊరట లభించింది. అయితే అప్పటి నుంచి తనపై తప్పుడు కథనాలు చేస్తున్నారంటూ ఆమె తాజాగా లీగల్ నోటీసులు పంపించడం సంచలనం రేపుతోంది. మరి కరాటే కళ్యాణి దీనిపై ఏమైనా స్పందిస్తుందా లేదా చూడాలి.