యంగ్ టైగర్ న్యూ లుక్… కోర మీసంతో క్లాసీ పిక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా డైనమిక్ లుక్ లో దర్శనం ఇచ్చారు. తారక్ స్టైలిస్ట్, అశ్విన్ మావ్లే ఈ రోజు ఎన్టీఆర్ స్టైలిష్ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పిక్ లో ఎన్టీఆర్ పూర్తిగా నలుపు రంగు సూట్‌ ధరించి అద్భుతంగా కనిపిస్తున్నాడు. తారక్ తన సూట్‌కు సరిపోయేలా నలుపు రంగు టై, నల్ల బూట్లు కూడా ధరించాడు. నటుడు తన క్లాసీ, స్టైలిష్ లుక్ తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు. ఆయన మెలి తిరిగిన కోర మీసాలు డైనమిక్ స్టార్ ని మరింత రాయల్‌గా చూపిస్తున్నాయి. క్షణాల్లో వైరల్‌గా మారిన ఈ పిక్ పై లైకులు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

Read Also : హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్.. వర్మకేనా..?

ప్రస్తుతం ఆ పిక్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రాజమౌళి “ఆర్‌ఆర్‌ఆర్‌’లో మరో కథానాయకుడిగా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటిస్తున్నారు. ఈ భారీ మాగ్నమ్ ఓపస్ మూవీ జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.

Related Articles

Latest Articles